రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు

ABN , First Publish Date - 2021-04-05T06:08:14+05:30 IST

బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని పలు రోడ్లకు కేం ద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కిం ద అనుమతులను ఇచ్చింది. పీఎంజీఎస్‌వై 3వ విడత కిం ద నిధులు కేటాయించింది.

రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని పలు రోడ్లకు కేం ద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కిం ద అనుమతులను ఇచ్చింది. పీఎంజీఎస్‌వై 3వ విడత కిం ద నిధులు కేటాయించింది. నియోజకవర్గం పరిధిలో మం జూరైన రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిం ది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంత్రి ప్రశాంత్‌రెడ్డికి లేఖ రూపంలో ఈ రోడ్ల మంజూరును తెలిపారు. త్వరగా పనులు చేపట్టాలని కోరారు. బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని భీంగల్‌ మండలం సికింద్రాపూర్‌ నుంచి ము చ్కూర్‌ వయా గోన్‌గొప్పుల రోడ్డు కోసం పీఎంజీఎస్‌వై కిం ద రూ.2.12 కోట్లు కేటాయించారు. ఇదే మండలం పరిధిలోని సికింద్రాపూర్‌, ముచ్కూర్‌ మధ్యన మరో బ్రిడ్జి నిర్మా ణం కోసం రూ.2.28 కోట్లు ఈ పథకం కింద కేటాయించా రు. భీంగల్‌ మండలం అక్లూర్‌ వయా బడా భీంగల్‌ మధ్య న నిర్మించే రోడ్డు కోసం రూ.1.96 కోట్లు కేటాయించారు. ఇ వేకాకుండా ముచ్కూర్‌, గోన్‌గొప్పుల మధ్య నిర్మించే మరో రోడ్డుకు రూ.4.20 కోట్లు కేటాయించారు. మొత్తంగా ఈ మ ండలం పరిధిలో నిర్మించే ఈ రోడ్లకు పీఎంజీఎస్‌వై కింద రూ.10.57 కోట్లను కేటాయించినట్లు మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ నిధులు వచ్చే విధంగా కృషి చేసిన గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-04-05T06:08:14+05:30 IST