క్రీడలతో మానసికోల్లాసం

ABN , First Publish Date - 2022-01-27T05:05:59+05:30 IST

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం
మేడ్చల్‌ : గెలుపొందిన జట్టుకు బహుమతి అందజేస్తున్న నాయకులు

మేడ్చల్‌/శామీర్‌పేట/కొడంగల్‌, జనవరి 26 : క్రీడలతో మానసికోల్లాసంతో పాటు దేహదారఢ్యం లభిస్తుందని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మద్దుల శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ కండ్లకోయలో బుధవారం ఎంఎ్‌సఆర్‌ యువసేన ఆధ్వర్యంలో వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. టీర్నీలో 5 జట్లు పాల్గొనగా కెఎన్‌ఆర్‌ జట్టు విజేతగా నిలిచింది. దీంతో ఆ జట్టుకు రూ.5వేల నగదు, బహుమతి అందజేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ కౌన్సిలర్లు బాలరాజు, హేమంత్‌రెడ్డి, కండ్లకోయ మాజీ సర్పంచ్‌ నరేందర్‌రెడ్డి, నాయకులు రాజేందర్‌ముదిరాజ్‌, సంజీవగౌడ్‌, వై.శ్రీనివాస్‌, సురేందర్‌గౌడ్‌, గౌస్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.  అదేవిధంగా క్రీడాకారులు గ్రామీణ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపర్చితే మంచి భవిష్యత్‌ ఉంటుందని సర్పంచ్‌ వనజాశ్రీనివా్‌సరెడ్డి, ఎంపీటీసీ ఇందిరారాజిరెడ్డిలు అన్నారు. శామీర్‌పేట మండలం లాల్‌గడిమలక్‌పేటలో నిర్వహించిన ఎంపీఎల్‌ క్రికెట్‌ టోర్నీ బుధవారం ముగిసింది. 8 టీంలు పాల్గొనగా విజేతలుగా మారథాన్స్‌, రన్నర్‌గా మాస్టర్‌ బ్లాస్టర్స్‌ నిలిచాయి. రన్నర్‌ జట్టుకు దాత కన్‌రెడ్డి మాలతిమాధవరెడ్డి రూ.10వేలు, విన్నర్‌ జట్టుకు రూ. 5వేల నగదు బహుమతి అందజేశారు. ఆర్గనైజర్లు రాజశేఖర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కబడ్డీ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం

సంక్రాంతిని పురస్కరించుకొని యువతీ,యువకులకు నిర్వహించిన కబడ్డీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు సర్పంచ్‌ టి.అనితపకీరప్ప బహుమతులు అందించారు. కొడంగల్‌ మండల పరిధిలోని అన్నారంలో పోటీల్లో విజేతలుగా నిలిచిన వీరేశం జట్టుకు మొదటి బహుమతిగా రూ.1,011, ద్వితీయ బహుమతిగా నవీన్‌గౌడ్‌ జట్టుకు రూ.511తో పాటు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులకు మెమొంటోలు అందించారు. సర్పంచ్‌ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు.

Updated Date - 2022-01-27T05:05:59+05:30 IST