క్రీడలతో మానసికోల్లాసం

ABN , First Publish Date - 2021-01-25T06:25:52+05:30 IST

క్రీడలతో యువతకు శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు.

క్రీడలతో మానసికోల్లాసం
మంథనిలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు

- జడ్పీ చైర్మన్‌

మంథని, జనవరి 24: క్రీడలతో యువతకు శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు. మం థని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో మంథని పో లీసుల ఆధ్వర్యంలో గోదావరిఖని పోలీస్‌ సబ్‌ డివిజన్‌ స్థాయి కబ డ్డీ పోటీలను మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి పుట్ట మధు  ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చై ర్మన్‌ మాట్లాడుతూ.. క్రీడలు యువతలో స్నేహభావాన్ని పెంపొందిస్తాయన్నారు. అందుకు క్రీడలను, క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములను క్రీడాకారు లు సమానం స్వీరించి క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. యువత కో సం పోలీసు డివిజన్‌స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడానికి ముం దుకు రావడం అభినందనీయమన్నారు. డీపీసీ రవీందర్‌ మాట్లాడు తూ.. యువత అసాంఘిక శక్తులకు దూరంగా చదవు, క్రీడల్లో రా ణించాలన్నారు. సమాజంలో ఉన్నతంగా ఎదిగి అందరి వికాసం కో సం పని చేయాలన్నారు. శాంతిభద్రతతోపాటు యువతను సన్మా ర్గంలో నడపటానికి జిల్లా పోలీసు యంత్రాంగం పని చేస్తోందన్నా రు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్‌, జడ్పీటీసీ తగరం సుమల తాశంకర్‌లాల్‌, సీఐ మహేందర్‌, ఎస్‌ఐ ఓంకా ర్‌యాదవ్‌, పీఈటీ లు దొమ్మటి రవి, మూడెత్తుల సమ్మయ్య, పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-25T06:25:52+05:30 IST