వేడుకగా సరదాల సంక్రాంతి

ABN , First Publish Date - 2021-01-16T05:11:21+05:30 IST

తెలుగింటి లోగిళ్లు కళకళలాడగా, కొత్త అల్లుళ్లతో మరదళ్ల ఆటపాటలు సరదాగా వేడుకగా సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు.

వేడుకగా సరదాల సంక్రాంతి
చాపాడులో జరుగుతున్న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు

వైభవంగా పార్వేట

కనువిందు చేసిన ముగ్గులు

అలరించిన బండలాగుడు పోటీలు 

తెలుగింటి లోగిళ్లు కళకళలాడగా, కొత్త అల్లుళ్లతో మరదళ్ల ఆటపాటలు సరదాగా వేడుకగా సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. అనేక ప్రాంతాల్లో ముగ్గులు, బండలాగుడు, ఉట్టికొట్టడం వంటి సరదాల పందాలు సాగాయి. ఆలయాల్లో ప్రత్యేక పూ జల అనంతరం స్వామివారిని ఊరేగించి, పార్వేట ఉత్సవం నిర్వహించారు. వివరాల్లోకెళితే...

మైదుకూరు, జనవరి 15: పట్టణంలోని వివిధ ఆల యాలు, మండలంలోని పలు గ్రామాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామాలయం, వేంకటేశ్వరుడు, మాధవరాయ దేవాలయాల్లో ఆయా గ్రామపెద్దల ఆధ్వర్యంలో  సంక్రాంతి, కనుమ పూజ లు నిర్వహించారు. యువకులకు కబడ్డీ, త్రోబాల్‌, క్రికెట్‌ తదితర ఆటలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు.

మాధవరాయస్వామి గ్రామోత్సవంలో ఆలయ అధ్యక్షుడు భూమిరెడ్డి సుబ్బరాయుడు సభ్యులు పాల్గొన్నారు. శ్రీరామ్‌ నగ ర్‌లోని కోదండ రామాలయంలో ద్వాదశి పూజలు నిర్వహించిన అనంతరం సంక్రాతి పూజలు నిర్వ హించారు. వివిధ ఆలయాల ఆవరణలో సాంస్కృతి క కార్యక్రమాలు నిర్వహించారు. మైదుకూరులో వెలిసిన శ్రీలక్ష్మీమాధవరాయస్వాములవారు శుక్రవా రం శ్రీదేవి,భూదేవితో కలిసి అశ్వవాహనంపై ఊరే గారు.

16 పల్లెల పార్వేట అనంతరం తిరిగి ఆల యానికి చేరుకునే వరకు వైభవంగా  నిర్వహిస్తారు.  గ్రామోత్సవంలో చెక్కభజన, కోలాటం తదితర సాం స్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మాధవరాయస్వామి కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని సత్కరించారు. వాసవీ క్లబ్‌ ఆధ్వ ర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు గాలిపటాల పోటీలు నిర్వహించారు.  

చాపాడు, జనవరి 15: వెదురూరు, నరహరి పురం, రాజుపాళెం గ్రామాల్లో సంక్రాంతి ఉత్సవాల ను ఘనంగా నిర్వహించారు. వెదురూరులో సంగ మేశ్వరస్వామి దేవాలయంలో శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెక్కభజన, కోలా టం, జానపద గేయాలు వంటి సాంస్కృతిక కార్యక్ర మాలు నిర్వహించారు.

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాష, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైసీపీ నేత సురేష్‌బాబు, భక్తులు దైవదర్శనం చేసుకున్నా రు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎడ్లకు రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నారు.

బ్రహ్మంగారిమఠం, జనవరి 15: చెంచయ్యగారి పల్లెలో సంక్రాంతి పండుగ సందర్భంగా శుక్రవారం సీతారామచంద్రుల గ్రామోత్సవం, పార్వేట  ఘనం గా చేపట్టారు. అనంతరం పార్వేటలో సోమిరెడ్డిపల్లె సహకార సంఘం సింగిల్‌విండో ఛైర్మన సి.నాగేశ్వర రెడ్డి కుందేలును ప్రజలముందు వదిలారు.

మండ ల వైసీపీ కన్వీనర్‌ సి.వీరనారాయణరెడ్డి యువకు లు, పిల్లలు, ప్రజలు పాల్గొన్నారు. కొత్తూరులో ము గ్గుల పోటీలను చేపట్టారు. విజేతలకు మొదటి బహుమతిని సింగిల్‌విండో ఛైర్మన నాగేశ్వరరెడ్డి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెండ్యం కుటుంబ సభ్యులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు.

ఖాజీపేట, జనవరి15:  మండలంలో శుక్రవారం సంక్రాంతి సందర్భంగా సీతారాములకు పార్వేట ఉత్సవం నిర్వహించారు. స్వామివారిని  ఊరేగించా రు. అనంతరం కుందేలు, కోడిని  వదిలారు.

కె.సుంకేసులలో నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతల కు మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి  బహుమతు లు అందించారు. చెముళ్లపల్లెలో బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను టీడీపీ మండలాధ్యక్షుడు రెడ్యం చంద్రశేఖర్‌ రెడ్డి ప్రారంభించారు. 

బద్వేలు, జనవరి 15: బద్వేలు డివిజన వ్యాప్తం గా సంక్రాంతి సంబరాలు వైభవంగా సాగాయి. సంక్రాంతి లక్ష్మీకి ప్రజలు ఆహ్వానం పలికారు. కను మ పండుగ రోజు పాడి పశువులను, ఎద్దులను, గేదెలను అలంకరించారు. సంక్రాంతి సంబరాలు ఆనందోత్సాహాల మధ్య వైభవంగా ముగిశాయి. 

ఘనంగా గొబ్బెమ్మ నిమజ్జనం 

 స్థానిక అబ్బరాతివీధిలో మహిళలు గురువారం గొ బ్బెమ్మ నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. కను మ పండుగ సందర్భంగా అబ్బరాతివీధిలో మహిళలు రామాలయం వద్ద గొబ్బెమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పురవీధుల్లో ఊరేగించి, నెల్లూరురోడ్డులోని నాగులచెరువులో నిమజ్జనం చేశారు.   

కలసపాడు, జనవరి 15: కలసపాడు మండల వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగా యి. గ్రామాల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. ఎగువరామాపురంలో ఏటా ఆనవాయితీగా గ్రామపెద్దల ఆధ్వర్యంలో పరుగు పందెం నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు.

కలసపాడులో దేవుని విగ్రహాలను ఊరేగింపు చేశారు. చింతలపల్లెలో సం క్రాంతి సందర్భంగా 800 మంది మహిళలకు బద్వే లు మాజీ మార్కెట్‌ యార్డు ఛైర్మన రంతు చీరలు పంపిణీ చేశారు. పండుగ సందర్భంగా ఆయన గ్రామంలో పలు క్రీడా పోటీలు నిర్వహించారు.

పోరుమామిళ్ల, జనవరి 15: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని టీచర్స్‌కాలనీలో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంతో పాల్గొని ఉట్టిని పగలగొట్టారు. ఉపాధ్యాయులు పీరయ్య, మురళి పాల్గొన్నారు.

కాశినాయన జనవరి 15: మండలంలో సంక్రాం తి పండుగను ప్రజలు సంప్రదాయబద్ధంగా చేసుకున్నారు. గ్రామాలు రంగురంగుల ముగ్గులతో బంధు మిత్రులతో కళకళలాడాయి. పండుగ సందర్భంగా కొండ్రాజుపల్లెలో విశ్రాంత ఉపాధ్యాయుడు నారాయణరెడ్డి 10 మంది కాడెదుల్ద రైతులను సత్కరి స్తూ ఎద్దులకు అలంకరణ వస్తువులు బహూకరించారు. శుక్రవారం నర్సాపురంలో పారేటోత్సవం, రాములవారి గ్రామోత్సవం నిర్వహించారు. ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

దువ్వూరు, జనవరి 15: సంక్రాంతి పండుగ పుర స్కరించుకుని మండల వ్యాప్తంగా ఘనంగా సంబ రాలు నిర్వహించారు. చిన్నసిగనపల్లెలో యువకుల కు కబడ్డీ పోటీలు నిర్వహించి విజేతలకు ఇరగంరె డ్డి శంకర్‌రెడ్డి, పద్మనాభరెడ్డి, నారుపల్లె చక్రధర్‌రెడ్డి బహుమతులు పంపిణీ చేశారు.

మనేరాంపల్లెలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచినవారికి మైదుకూరు మార్కెట్‌యార్డు వైస్‌ఛైర్మన కోటా రామమునిరెడ్డి బహుమతులు అం దించారు. కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారిని ఊరేగించారు. 

చక్రాయపేట, జనవరి 15: సంక్రాంతి పండుగ మండలంలో సరదాగా సాగింది. పిల్లలు, యువకు లు ఆటపాటలు, కోడిపందేలు, టెంకాయ పందేలు, ఊయలు ఇలా సరదాగా గడిపారు. వచ్చిన బంధు మిత్రులతో కలిసి సంక్రాంతిని సరదాగా చేసుకున్నారు. గండి క్షేత్రం వీరాంజనేయస్వామికి ప్రాకారోత్సవం ఘనంగా నిర్వహించారు. సహాయ కమిషనర్‌ పట్టెం గురుప్రసాద్‌ ఆదేశాల మేరకు అర్చకులు కేసరి, రాజారమేష్‌లు అంజన్నకు ప్రాకారోత్సవం నిర్వహించారు.

సింహాద్రిపురం, జనవరి 15: మహిళల్లో దాగి ఉన్న నైపుణ్యం వెలికితీసేందుకే ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారని ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి పేర్కొ న్నారు. సంక్రాంతి పండుగ రోజున గురువారం బి.చెర్లోపల్లిలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేత లకు ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి బహుమతులు పం పిణీ చేశారు.

మాజీ సర్పంచ మనోహర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ కృపాకర్‌రెడ్డి, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. వై.కొత్తపల్లిలో మారుతీ డిజిటల్‌ స్టూడియో, కానిస్టేబుల్‌ ఆంజనేయులు  ఆధ్వర్యం లో యువతీ, యువకులకు నంబర్‌ రైటింగ్‌ గేమ్‌ నిర్వహించి విజేతలకు మాజీ ఉప సర్పంచ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.





Updated Date - 2021-01-16T05:11:21+05:30 IST