Jul 9 2021 @ 00:16AM

వినోదం, సందేశంతో తిమ్మరుసు

తెలివైన, నిజాయితీ కలిగిన లాయర్‌ పాత్రలో సత్యదేవ్‌ నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’ ట్యాగ్‌లైన్‌. ఈ నెల 30న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సత్యదేవ్‌ మాట్లాడుతూ ‘‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ తర్వాత కథ నచ్చి చేస్తున్న చిత్రం ఇది. దర్శకుడు ‘తిమ్మరసు’ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు’’ అని చెప్పారు. ‘‘కొవిడ్‌ పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌ పూర్తి చేశాం. వాణిజ్య హంగులు, మంచి వినోదం, సందేశం ఉన్న చిత్రం ‘తిమ్మరుసు’’ అని చిత్ర నిర్మాతలు మహేశ్‌ కోనేరు, సృజన్‌ తెలిపారు. ‘‘తెలివైన లాయర్‌ పాత్రలో సత్యదేవ్‌ మంచి నటన కనబరిచారు. త్వరలోనే థియేటర్లలో విడుదల కానుండడం సంతోషంగా ఉంది’’ అని దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి చెప్పారు. ప్రియాంకా జవాల్కర్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్‌ పాకల సంగీతం అందించారు. బ్రహ్మాజీ, అజయ్‌, ఝాన్సీ కీలకపాత్రలు పోషించారు.