వాట్సాప్‌లో ఫన్‌ గేమ్స్‌

ABN , First Publish Date - 2021-05-01T05:30:00+05:30 IST

మొబైల్‌లో ఎన్ని గేమ్స్‌ ఆడినా ఎదురెదురుగా కూర్చుని లేదంటే గుమికూడి ఆడితే వచ్చే కిక్కే వేరు. అయితే, కొవిడ్‌ సంక్షోభంతో మొత్తం పరిస్థితులు తలకిందులయ్యాయి.

వాట్సాప్‌లో ఫన్‌ గేమ్స్‌

మొబైల్‌లో ఎన్ని గేమ్స్‌ ఆడినా ఎదురెదురుగా కూర్చుని లేదంటే గుమికూడి ఆడితే వచ్చే కిక్కే వేరు. అయితే, కొవిడ్‌ సంక్షోభంతో మొత్తం పరిస్థితులు తలకిందులయ్యాయి. ఆనందాలన్నీ ఆవిరయ్యాయి.  ఎవరింటికైనా వెళ్లినా భయం భయం.  కొవిడ్‌ను తెచ్చుకుంటున్నామో, తగిలిస్తున్నామో అనే అనుమానమే.  దరిమిలా  మనకు బాగా తెలిసిన అంత్యాక్షరి నుంచి అనేకానేక ఆటలకు వాట్సాప్‌ వేదికగా మారుతోంది. ఫోన్‌ చేసి మాట్లాడుకోవడం, యాక్షన్‌ అడ్వెంచర్‌ గేమ్స్‌తో విసిగిన జనాలకు ఈ గేమ్స్‌ కూసింత ఊరటనిచ్చేవే.


ఇరవై ప్రశ్నలతో ఫన్‌ గేమ్‌ అందులో ఒకటి. ఇందులో ఎంత మందైనా పాల్గొనవచ్చు. ఆబ్జెక్ట్‌, నేమ్‌, ప్లేస్‌ ఏదైనా కావచ్చు... ఒకటి ఎంపిక చేసుకుని గేమ్‌ మొదలు పెట్టేయడమే. ఉదాహరణకు నూడిల్స్‌ అంటూ ఒక టాపిక్‌ ఎంచుకున్నారని అనుకుందాం.  వెంటనే మిగతా వ్యక్తులు కనీసం ఇరవై ప్రశ్నలు నూడిల్స్‌పై రూపొందించాలి. ఇవన్నీ ఎస్‌, నో ఫార్మాట్‌లో ఉంటాయి. 


మరొకటి, స్నేహితులు ఈ గేమ్‌లో ప్రశ్నలను టాగ్‌  చేస్తారు. దీనికోసం వాట్సాప్‌ లేదంటే టెక్స్ట్‌ మెసేజింగ్‌ వేదిక దేన్నైనా ఉపయోగించుకోవచ్చు. నచ్చిన సినిమా నుంచి ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. ఎవరు ఎక్కువ సమాధానాలు తడుముకోకుండా చెప్పగలరో వారు గెలిచినట్టు. ఇద్దరు కూడా ఆడుకోవచ్చు. ఇందులో అప్పటికప్పుడు తట్టిన పదం ఒకరు చెబుతారు. రెండో వ్యక్తి దానిపై సమాధానం ఇవ్వాలి. యావత్తు వ్యవహారం ఆ పదం చుట్టూ సాగుతుంది. 


అంత్యాక్షరి అందరికీ తెలిసిందే. భారతదేశంలో అత్యంత పాపులర్‌ గేమ్‌. ఏ చిన్న గాదరింగ్‌ జరిగినా అంత్యాక్షరి ఉండాల్సిందే. సాధారణంగా స్నేహితులు లేదంటే బంధువులు రెండు గ్రూపులుగా విడిపోయి ఈ గేమ్‌ ఆడతారు. అరుపులు, కేరింతలతో ఆ ఇల్లు దద్ధరిల్లుతుంది. ఒకరు ముందు పాట పాడతారు. అదీ పల్లవితో ముగిస్తారు. అందులో చివరి అక్షరంతో రెండో గ్రూప్‌ మొదలుపెట్టాలి. అదే వాట్సాప్‌లో ఒకరు పాటలో పల్లవిని టైప్‌ చేస్తారు.




ఆటకు పెట్టు కున్న నియమం ప్రకారం అవతలి వ్యక్తి చివరి అక్షరంతో మొదలుపెడతారు. వాయిస్‌ రికార్డ్‌ చేసి పంపుకోవచ్చు. అదీ కాదను కుంటే వీడియో కాల్‌ పెట్టుకుని ఎప్పటి మాదిరిగానే ఆడుకోవచ్చు. మొత్తమ్మీద సరదాలను మిస్‌ కానవసరం లేదు. ఈ మండుటెండ ల్లోనూ ఇంట్లోనే కూర్చుని కాలక్షేపం చేసేయవచ్చు. 

Updated Date - 2021-05-01T05:30:00+05:30 IST