Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 03 Jul 2022 04:00:44 IST

వినోదం, భావోద్వేగభరితం

twitter-iconwatsapp-iconfb-icon

రామ్‌ పోతినేని పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటించిన చిత్రం ‘ది వారియర్‌’. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కింది. కృతిశెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి ప్రతినాయక పాత్ర పోషించారు. లింగుస్వామి దర్శకుడు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. జులై 14న విడుదలవుతోంది. అనంతపురంలో ప్రేక్షకుల మధ్యన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. రామ్‌ మాట్లాడుతూ ‘సినిమాలో ప్రతి ఎమోషన్‌ జెన్యూన్‌గా ఫీలై చేశాను. లింగుస్వామి కథను వినోద భరితంగా నడిపిస్తూనే భావోద్వేగభరితంగా ఆవిష్కరించారు’ అన్నారు. లింగుస్వామి మాట్లాడుతూ ‘తెలుగులో నేరుగా ఓ చిత్రం చేయాలనే కోరిక ‘ది వారియర్‌’తో తీరింది. నా తదుపరి చిత్రం కూడా శ్రీనివాసా చిట్టూరి గారి బ్యానర్‌లో చే స్తా’ అన్నారు. రామ్‌ చాలా గొప్ప ఎనర్జిటిక్‌ హీరో, అతనితో పనిచేయడం గొప్ప అనుభవమని ఆది పినిశెట్టి అన్నారు. ట్రైలర్‌ మాసీగా ఉంది, నా పాత్ర కూడా అలానే ఉంటుందని కృతిశెట్టి చెప్పారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement