అమెరికా ముఖ్య సూచన.. ప్రయాణికులకు ఇది మాత్రం తప్పనిసరి..!

ABN , First Publish Date - 2021-11-07T02:07:34+05:30 IST

టీకా తీసుకున్న విదేశీయులందరినీ ఎటువంటి ఆంక్షలు లేకుండా నవంబర్ 8 నుంచి తమ దేశంలోకి అనుమతిస్తామంటూ అమెరికా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన కారణంగా భారత్‌తో పాటూ ప్రపంచ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

అమెరికా ముఖ్య సూచన.. ప్రయాణికులకు ఇది మాత్రం తప్పనిసరి..!

ఇంటర్నెట్ డెస్క్: టీకా తీసుకున్న విదేశీయులందరినీ ఎటువంటి ఆంక్షలు లేకుండా నవంబర్ 8 నుంచి తమ దేశంలోకి అనుమతిస్తామంటూ అమెరికా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన కారణంగా భారత్‌తో పాటూ ప్రపంచ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అయితే..ఈ విషయంలో అమెరికా తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. కరోనా టీకా తీసుకోని వారు అమెరికా విమానం ఎక్కే ముందు కరోనా టెస్టులో నెగెటివ్ వచ్చినట్టు రిపోర్టు చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రయాణానికి ఒక రోజు ముందే వీరు టెస్టు చేయించుకోవాలి.


టీకా తీసుకున్న వారు మాత్రం ఎప్పటిలాగే ప్రయాణానికి మూడు రోజుల ముందు టెస్ట్ చేయించుకోవాలి. ఇక చిన్నారులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. వారి వెంట ఉన్న పెద్దలు కరోనా టీకా తీసుకున్నారా లేదా అన్న దాన్ని బట్టి.. ప్రయాణానికి ఎన్ని రోజుల ముందు కరోనా టెస్ట్ చేయించుకోవాలనేది నిర్ణయమవుతుంది. కాగా.. విమానం ఎక్కే ముందే అధికారులు ఈ వివరాలన్నిటినీ తనిఖీ చేస్తారు. పేరు, పుట్టినతేదీ ఆధారంగా ఓ వ్యక్తి ఇచ్చిన వివరాలు నిజమైనవో కావో నిర్ధారించుకుంటారు. కరోనా టెస్ట్‌లో నెగెటివ్ ఫలితం వచ్చినట్టు తేలితేనే ప్రయాణానికి అనుమతిస్తారు. 

Updated Date - 2021-11-07T02:07:34+05:30 IST