పాల ఉత్పత్తిదారులకు పూర్తి సహకారం

ABN , First Publish Date - 2021-11-28T05:25:43+05:30 IST

పాల ఉత్పత్తిదారులకు అన్ని విధాలా సహకారం, ప్రోత్సాహం అందిస్తామని సంగం డెయిరీ చైర్మన్‌ దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. డెయిరీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బీఎంసీ పాయింట్‌ వద్ద 50శాతం సబ్సిడీపై గడ్డికోత మిషన్‌లను పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని నర్రావారిపాలెంలో పాల ఉత్పత్తిదారులకు 14,54,000 రూపాయల బోన్‌సను అందజేశారు. మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నరేంద్ర మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారులకు సంగం డెయిరీ ఎక్కువ ధర ఇవ్వడంతోపాటు, బోన్‌సను కూడా చెల్లిస్తున్నదని చెప్పారు.

పాల ఉత్పత్తిదారులకు పూర్తి సహకారం
పాల ఉత్పత్తిదారులకు బోనస్‌ పంపిణీ చేస్తున్న సంగం డెయిరీ చైర్మన్‌ దూళిపాళ్ల నరేంద్ర

 సంగం డెయిరీ చైర్మన్‌ నరేంద్ర

అద్దంకి, నవంబరు 27: పాల ఉత్పత్తిదారులకు అన్ని విధాలా సహకారం, ప్రోత్సాహం అందిస్తామని సంగం డెయిరీ చైర్మన్‌ దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. డెయిరీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బీఎంసీ పాయింట్‌ వద్ద 50శాతం సబ్సిడీపై గడ్డికోత మిషన్‌లను పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని నర్రావారిపాలెంలో పాల ఉత్పత్తిదారులకు 14,54,000 రూపాయల బోన్‌సను అందజేశారు. మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నరేంద్ర మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారులకు సంగం డెయిరీ ఎక్కువ ధర ఇవ్వడంతోపాటు, బోన్‌సను కూడా చెల్లిస్తున్నదని చెప్పారు. డెయిరీని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. సంగం  డెయిరీ చిత్తూరు సీనియర్‌ మేనేజర్‌  వైపీ చౌదరి, మరో సీనియర్‌ మేనేజర్‌ పాతూరు కృష్ణారావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ సురే్‌షబాబు, సూపర్‌వైజర్‌ పరిటాల నాగరాజు, ఈశ్వరీదేవి, రవీంద్రనాథ్‌, దొప్పలపూడి దుర్గాప్రసాద్‌, నర్రా సుబ్బారావు, కాంతయ్య, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-11-28T05:25:43+05:30 IST