ఎన్నికల అధికారులకే పూర్తి బాధ్యతలు

ABN , First Publish Date - 2021-02-28T06:22:35+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో ఈ దఫా ఎన్నికల అధికారులకు బాధ్యతలు పెరిగాయి. పోలింగ్‌ పూర్తయి బ్యాలెట్‌ పేపర్లు, బాక్సులు భద్రపరిచే వరకు వీరికే బాధ్యతలు అప్పగించారు.

ఎన్నికల అధికారులకే పూర్తి బాధ్యతలు

చిత్తూరు, ఫిబ్రవరి 27: మున్సిపల్‌ ఎన్నికల్లో ఈ దఫా ఎన్నికల అధికారులకు బాధ్యతలు పెరిగాయి. పోలింగ్‌ పూర్తయి బ్యాలెట్‌ పేపర్లు, బాక్సులు భద్రపరిచే వరకు వీరికే బాధ్యతలు అప్పగించారు. గతంలో మున్సిపల్‌ కమిషనర్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తే పీవోలు, ఏపీవోలు ఆయన ఆధీనంలో ఎన్నికల విధులు నిర్వహించే వారు. ఎన్నికల కమిషన్‌ తాజా నిర్ణయంతో ప్రతి నాలుగు వార్డులకు ఒక ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారి, అదనపు ఎన్నికల అధికారులను నియమిస్తారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు, పర్యవేక్షణ వరకే మున్సిపల్‌ అధికారులను పరిమితం చేశారు. ఎన్నికల నిర్వహణలో మున్సిపల్‌ అధికారుల పాత్ర ఉంటే రాజకీయ నాయకులకు సహకరించే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్‌ గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2021-02-28T06:22:35+05:30 IST