పూర్తి వేతనాలను విడుదల చేయాలి

ABN , First Publish Date - 2020-06-02T09:26:26+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లాక్‌డౌన్‌ సమయంలో కోత విధించిన వేతనాలను విడుదల చేయాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు

పూర్తి వేతనాలను విడుదల చేయాలి

(ఆంధ్రజ్యోతి-న్యూస్‌ నెట్‌వర్క్‌):  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లాక్‌డౌన్‌ సమయంలో కోత విధించిన వేతనాలను విడుదల చేయాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు సోమవారం తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రణాళికబద్ధంగా ఖర్చు చేసుకునే ఉద్యోగులు వేతనాల్లో కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


పింఛనర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉందని వారు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వేతనాల కోతపై తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా విద్యుత్‌ ఉద్యోగులు సైతం సోమవారం ఆందోళన బాటపట్టారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్‌ సంస్కరణల బిల్లును నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర పవర్స్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్‌ కార్యాలయాల ఎదుట ఆందోళన చేశారు. 


సూర్యాపేట జిల్లాలో 

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక నాయకులు సిహెచ్‌.రాములు, కొలిశెట్టి యాదగిరిరావు, వెంకటేశ్వర్లు, చంద్రమౌళి, సయ్యద్‌, కృష్ణారెడ్డి, దశరథరామారావు, విద్యుత్‌ శాఖ కార్యాలయం వద్ద సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ సి.హెచ్‌.పాల్‌రాజ్‌, వెంకటేశ్వర్లు, యాదగిరినాయుడు, దశరథ రెడ్డి, రహీం, దయాకర్‌రెడ్డి, తిరుమలగిరిలో ఉద్యోగ సంఘాల నాయకులు చల్లగుండ్ల సోమయ్య, వీరు, సత్తయ్య, చంద్రయ్య పాల్గొనగా; కోదాడలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తుంగతుర్తిలో టీఎ్‌సయూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి సోమయ్య, నాయకులు కరుణాకర్‌, రవీందర్‌, హుజూర్‌నగర్‌లో ఐక్యవేదిక నాయకులు ఓరుగంటి నాగేశ్వరరావు, విష్ణుదాస్యం యతిపతిరావు, కేవీ సత్యనారాయణ, నేరేడుచర్లలో నాయకులు అనిల్‌, నర్సింహారావు, రాంబాబు, తుంగతుర్తిలో టీఎ్‌సయూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి సోమయ్య, కరుణాకర్‌, రవీందర్‌, నరేష్‌ పాల్గొన్నారు.


నల్లగొండ జిల్లాలో

నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ వద్ద ఆందోళనలో నాయకులు ఎం.రాజశేఖర్‌రెడ్డి, ఎడ్ల సైదులు, సి.సత్యనారాయణ, కె.రత్నాయ్య, ఎండి ఖుర్షీద్‌ మియా, దేవరకొండలో జేఏసీ నాయకులు గోవర్థన్‌రావు, సత్యనారాయణ, దేవకుమార్‌, తావుర్య, హాలియాలో టీఎ్‌సయూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి రాజు, సైదులు, ప్రశాంత్‌, సయ్యద్‌మియా పాల్గొన్నారు. అదేవిధంగా మిర్యాలగూడలో విద్యుత్‌ ఉద్యోగుల ధర్నాలో విద్యుత్‌ ఉద్యోగుల సంఘం నాయకులు సోమాచారి, మారం శ్రీనివాస్‌, డీఈ వెంకటకృష్ణ, విజయ్‌కుమార్‌, ఆంజనేయులు, క్రాంతికుమారి, కొండమల్లేపల్లిలో  విద్యుత్‌ సిబ్బంది నల్లబ్యాడ్జీలతో కొండమల్లేపల్లిలో నిరసన వ్యక్తం చేశారు. మునుగోడులో నాయకుడు గేర నర్సింహ, నాయకులు విజయ్‌ప్రసాద్‌, గణేష్‌ పాల్గొన్నారు.


యాదాద్రి జిల్లాలో 

భువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ వద్ద ఆందోళనలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఐక్యకార్యాచరణ కమిటీ ప్రతినిధులు ముక్కెర్ల యాదయ్య, భాస్కర్‌, మెతుకు సైదులు, సత్తయ్య, రమేష్‌, మట్టయ్య, పాల్గొన్నారు. చౌటుప్పల్‌లో టీఎ్‌సయూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ప్ల కార్డులతో నిరసన తెలిపారు. మోత్కూరులో యూటీఎఫ్‌ మండల అధ్యక్షుడు ఎ.వెంకటాచారి,నాయకులు సోమేశ్వర్‌, బుగ్గయ్య, వెంకన్న, పాల్గొన్నారు.


Updated Date - 2020-06-02T09:26:26+05:30 IST