శాకాహారులకు పూర్తి ప్రోటీన్లు అందాలంటే ఏం చేయాలి?

ABN , First Publish Date - 2022-03-11T21:13:16+05:30 IST

ప్రొటీన్లు అంటే మాంసకృతుల కోసం శాకాహారులు అన్ని రకాల పప్పుధాన్యాలు, సెనగలు, అలసందలు, సోయాబీన్స్‌, కిడ్నీబీన్స్‌, ఉలవలు మొదలైన గింజలన్నీ తీసుకోవచ్చు. సోయాపనీర్‌ (టోఫు), మీల్‌ మేకర్‌ (సోయాచంక్స్‌) చక్కని ప్రొటీన్‌ను అందిస్తాయి. పాలు, పెరుగు

శాకాహారులకు పూర్తి ప్రోటీన్లు అందాలంటే ఏం చేయాలి?

ఆంధ్రజ్యోతి(11-03-2022)

ప్రశ్న: శాకాహారంలో పూర్తి ప్రొటీన్లు అందించే ఆహార పదార్థాల గురించి తెలియజేస్తారా? 


- పూర్ణిమ, అవనిగడ్డ


డాక్టర్ సమాధానం: ప్రొటీన్లు అంటే మాంసకృతుల కోసం శాకాహారులు అన్ని రకాల పప్పుధాన్యాలు, సెనగలు, అలసందలు, సోయాబీన్స్‌, కిడ్నీబీన్స్‌, ఉలవలు మొదలైన గింజలన్నీ తీసుకోవచ్చు. సోయాపనీర్‌ (టోఫు), మీల్‌ మేకర్‌ (సోయాచంక్స్‌) చక్కని ప్రొటీన్‌ను అందిస్తాయి. పాలు, పెరుగు, పనీర్‌, కొవ్వు శాతం తక్కువగా ఉండే చీజ్‌ మొదలైన వాటి నుండి కూడా ప్రొటీన్‌ లభిస్తుంది. కూరగాయల్లో, ముఖ్యంగా బ్రొకోలి, పాలకూర లాంటి వాటిల్లో కూడా మాంసకృతులు ఉంటాయి. కాబట్టి వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసినంత అందుతుంది. బాదం, పిస్తా, వేరుశెనగ లాంటి గింజలలోను ప్రొటీన్‌ ఉంది. ఆవశ్యక అమైనోఆమ్లాలు తగు మోతాదులో ఉన్న ప్రొటీన్లను కంప్లీట్‌ ప్రొటీన్‌ సోర్సెస్‌ అంటారు. సాధారణంగా జంతువుల నుండి వచ్చే రకాన్ని కంప్లీట్‌ ప్రొటీన్‌గా పేర్కొనవచ్చు. శాకాహారంలో సోయాబీన్స్‌, సోయాపాలు, సోయాపనీర్‌, సాధారణ పాలను పూర్తి ప్రొటీన్‌ ఆహారానికి మూలంగా పరిగణిస్తారు.  


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)


Updated Date - 2022-03-11T21:13:16+05:30 IST