ఫుల్‌ కిక్కు!

ABN , First Publish Date - 2021-10-14T06:29:19+05:30 IST

ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అన్ని మద్యం దుకాణాలకు ముందుగానే మద్యం నిల్వలను తెచ్చుకున్న నిర్వాహకులు భారీగా అమ్మకాలు చేస్తున్నారు. దుకాణాలే కాకుం డా బెల్ట్‌షాప్‌ల ద్వారా ఎక్కువ మొత్తంలో సరఫరా చేస్తున్నారు.

ఫుల్‌ కిక్కు!

జిల్లాలో జోరుగా మద్యం అమ్మకాలు
బెల్ట్‌షాప్‌లపై దృష్టిపెట్టిన ఎక్సైజ్‌ అధికారులు
ఉమ్మడి జిల్లాలో 128 మద్యం షాప్‌లు

నిజామాబాద్‌, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అన్ని మద్యం దుకాణాలకు ముందుగానే మద్యం నిల్వలను తెచ్చుకున్న నిర్వాహకులు భారీగా అమ్మకాలు చేస్తున్నారు. దుకాణాలే కాకుం డా బెల్ట్‌షాప్‌ల ద్వారా ఎక్కువ మొత్తంలో సరఫరా చేస్తున్నారు. గ్రామాలు, మున్సిపాల్టీ లు అనే తేడా లేకుండా మద్యం అమ్ముతున్నారు. సరిహద్దుల్లో మహారాష్ట్ర మద్యం కూడా పండగ సందర్భంగా అమ్మకాలను చేస్తున్నారు. మద్యం సేల్స్‌పైన దృష్టిపెట్టిన అధికారులు బెల్ట్‌షాప్‌లను మాత్రంపట్టించుకోవడంలేదు.
ఫ ఉమ్మడి జిల్లాలో అమ్మకాల జోరు
ఉమ్మడి జిల్లాలో దసరా సందర్భంగా మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. వారం రోజుల నుంచి ఈ మద్యం అమ్మకాలు పెరిగాయి. దసరాను దృష్టిలో పెట్టుకుని మధ్యంషాప్‌ల నిర్వాహకులు ముందుగానే నిల్వలను సిద్ధం చేసుకున్నారు. జోరుగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 128 మద్యం షాప్‌లు ఉన్నాయి. వీటిలో పాటు 14 బార్‌లు ఉన్నాయి. నిజామాబాద్‌ పరిదిలో 91 మధ్యం దుకాణాలు ఉండగా కామారెడ్డి పరిధిలో 37 మధ్యంషాప్‌లు ఉన్నాయి. వీటి ద్వారా అమ్మకాలను చేస్తున్నారు. ఈ మధ్యంషాప్‌ల పరిధిలో సుమారు వెయ్యికిపైగా బెల్ట్‌షాప్‌లు ఉన్నాయి.
ఫ ప్రతియేటా రూ.కోట్లలో వ్యాపారం
ప్రతీ సంవత్సరం దసరా సందర్భంగా మధ్యం అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ సం వత్సరం కూడా అదే రీతిలో అమ్మకాలు సాగుతున్నాయి. మధ్యంషాప్‌లకు ఈ సంవత్స రం కూడా ఎక్కువ మొత్తంలో సరఫరా చేశారు.  గత సంవత్సరం దసరా సీజన్‌లో అక్టోబరు 1 నుంచి 12 వరకు మొత్తం 12 రోజుల్లో 39.57 కోట్ల రూపాయల అమ్మకాలు ఉమ్మడి జిల్లా పరిధిలో జరిగాయి. ఈ  సంవత్సరం ఈ 12 రోజుల్లో రూ.46 కోట్ల 18లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం మద్యం కంటే బీర్ల అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. గత సంవత్సరం పండగ సీజన్‌లో 12 రోజు ల్లో 47243 లిక్కర్‌ కేసులు అమ్మకాలు జరగగా 50470 బీర్‌ల కేసులు అమ్మకాలు జరిగాయి. ఈ సంవత్సరం 12 రోజుల్లో లిక్కర్‌ 54,830 కేసులు అమ్మకాలు జరగ్గా, బీర్లు 60,810 కేసుల అమ్మకాలు జరిగాయి. దసరా ఉన్న ఈ మూడు రోజుల్లోకూడా మరో 20 కోట్లకు పైగా అమ్మకాలు జరుగుతాయని ఎక్సైజ్‌శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పండగ సీజన్‌ కావడం, కుటుంబ సభ్యులంతా ఇళ్లల్లో ఉండడంతో ఈ మధ్యం అమ్మకాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి.
ఫ సమయ పాలన పట్టించుకోని తీరు
ఉమ్మడి జిల్లాలో పండగ సీజన్‌ కావడంతో మద్యం దుకాణాలు మూసివేసే సమయం పట్ల అధికారులు కూడా పట్టించుకోవడంలేదు. సేల్స్‌పైన దృష్టిపెట్టడం వల్ల రాత్రివేళల్లో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లోని బెల్ట్‌షాప్‌లలో ధరలు పెంచి విచ్చల విడిగా అమ్మకాలు జరుపుతున్న పట్టించుకోవడం లేదు. గ్రామాభివృద్ధి కమిటీలతో ఒప్పం దం చేసుకున్న నిర్వాహకులు పండగ సీజన్‌ కావడం వల్ల ఎక్కువ అమ్మకాలను చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గడిచిన రెండేళ్లుగా ఇప్పటి వరకు ఏ బెల్ట్‌షాప్‌పైన కూడా అధి కారులు చర్యలు తీసుకోవడంలేదు. కనీసం ధరలు పెంచి అమ్మినా.. పట్టించుకోవడంలేదు. పండగ సీజన్‌లో టార్గెట్‌కు అనుగుణంగా అమ్మకాలపైన దృష్టిపెట్టి కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల బెల్ట్‌షాప్‌లపైన ఫిర్యాదులు వచ్చిన పట్టించుకోవడంలేదు. సరిహద్దుల్లో మహారాష్ట్ర మధ్యం అమ్మకాలు కూడా కొనసాగుతున్నాయి. అప్పుడప్పుడు అదికారులు నామమాత్రంగా పట్టుకుంటున్న సరిహద్దు గ్రామాల్లో మాత్రం ఈ మద్యం దందా కొనసాగుతోంది. మహారాష్ట్ర మద్యం ధరలు తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. కొన్నిచోట్ల అధికారులకు తెలిసే నిల్వలు వచ్చిన చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పండగ సీజన్‌ సందర్భంగా కొంత సేల్స్‌ పెరిగాయని ఐఎంఎల్‌ డిపో డీఎం వెంకటస్వామి తెలిపారు. పండగ సందర్భంగా ఎక్కువ మొత్తంలో మధ్యంషాప్‌ల యజమానులు స్టాక్‌ తీసుకెళ్లారని తెలిపారు. ప్రతీ సంవత్సరం కొద్దిమొత్తంలో సేల్స్‌ పెరుగుతాయని ఆయన తెలిపారు.

Updated Date - 2021-10-14T06:29:19+05:30 IST