తిరుమలగిరిలో ‘దళితబంధు’ పూర్తిశాతం అమలు

ABN , First Publish Date - 2022-09-29T05:56:38+05:30 IST

పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపికైన తిరుమలగి రి మండలంలో దళితబందు పథకం అమలు త్వరలోనే పూర్తి కానుందని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ తెలిపారు.

తిరుమలగిరిలో ‘దళితబంధు’ పూర్తిశాతం అమలు
మునిసిపల్‌ కార్యాలయంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌

తిరుమలగిరి, సెప్టెంబరు 28 : పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపికైన తిరుమలగి రి మండలంలో దళితబందు పథకం అమలు త్వరలోనే పూర్తి కానుందని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ తెలిపారు. తిరుమలగిరి మునిసిపల్‌ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్‌, మునిసిపాలిటీ, మండల, వార్డు దళితబంధు అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలగిరిలో 2,223 మందిదళితులకు పథకం కింద అకౌంట్లు తెరిచారని,వీలైనంత త్వరగా యూనిట్లకు సంబంధించి కొటేషన్లు ఇస్తే, వెంటనే డబ్బులు జమచేస్తామన్నారు. అధికారులు అవగాహన కల్పిస్తూ ప్రక్రియ త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో తిరుమలగిరిలో  దళితబంధు అమలు అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శిరీష, కమిషనర్‌  శ్రీను, ఎంపీడీవో ఉమే్‌షచారి, ఎంపీవో మారయ్య తదితరులు  పాల్గొన్నారు.


Updated Date - 2022-09-29T05:56:38+05:30 IST