ఆరెకటికెల అభివృద్ధికి పూర్తి సహకారం

ABN , First Publish Date - 2021-10-27T04:53:07+05:30 IST

ఆరె కటికెలకు మద్యం దుకాణాలలో రిజర్వేషన్లు కల్పించే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి అన్నారు.

ఆరెకటికెల అభివృద్ధికి పూర్తి సహకారం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

-మద్యం దుకాణాలలో రిజర్వేషన్లపై  సీఎం దృష్టికి తీసుకెళ్తా 

- ఆరెకటికెల సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి 


జడ్చర్ల, అక్టోబరు 26 : ఆరె కటికెలకు మద్యం దుకాణాలలో రిజర్వేషన్లు కల్పించే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణంలోని చంద్రాగార్డెన్స్‌లో మంగళవారం ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఆరెకటికెలను బిసి డి గ్రూపులో నుంచి బిసి ఏ గ్రూపులోకి మా ర్చాలని, మొబైల్‌ మటన్‌ స్టాళ్లను రద్దు చేయాలని, ఫెడరేషన్‌ ఏర్పాటు చేయా లన్న డిమాండ్లను సైతం సీఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేనివిధంగా 40 లక్షల కుటుంబాలకు పెన్షన్లు అందిస్తు న్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. వ్యవసాయదారులకు రైతుబంధు, రైతుభీమా పథకాలు, వ్యవసాయానికి 24గంటల పాటు విద్యుత్‌ సరఫరా, సాగునీటి కోసం ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే మొదటి విడతగా గొర్రెల పంపిణీ ప్రక్రియ చేపట్టామని, త్వరలోనే రెండవ వి డత అందించిబోతున్నామని పేర్కొన్నారు. జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలోని అన్ని మటన్‌ మార్కెట్‌లు అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. త్వరలోనే ఇం టిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్‌ మార్కెట్‌ రానున్నదన్నారు. జడ్చర్లలో ఆరికటికెల కమ్యూనిటీ భవనం కోసం స్థలం చూపించారని, త్వరలోనే నిర్మాణం చేసుకుం దామన్నారు. బాదేపల్లి మటన్‌ మార్కెట్‌ను అధునాతనంగా తయారు చేశామ ని, త్వరలోనే వేయింగ్‌ మిషన్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. మటన్‌ వ్యాపారం లోకి బయటివాళ్లు రాకుండా ఆరెకటికెలకు పూర్తి సహాయ, సహకారాలు అంది స్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోడ్గల్‌ యాదయ్య, ఆరెకటిక సంఘం నాయకులు అశోక్‌జీ, బాలాజీ, భాగ్యలక్ష్మి, శివరాములుజీ, ఖాజారాంజీ, రమేశ్‌జీ, భగవాన్‌జీ, మధు, శివాజీ, మనోహర్‌, శ్రీరాం, నాగోజీలతో పాటు సంఘం నాయకులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T04:53:07+05:30 IST