కొవిడ్‌ వ్యాక్సిన్‌ నిర్భయంగా వేయించుకోండి

ABN , First Publish Date - 2021-03-05T06:26:58+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఎటువంటి సందేహాలు అవసరం లేదని, నిర్భయంగా ముందుకు రావాలని సబ్‌ కలెక్టర్‌ నారపరెడ్డి మౌర్య సూచించారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ నిర్భయంగా వేయించుకోండి
వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న సబ్‌ కలెక్టర్‌ మౌర్య

  నర్సీపట్నం, మార్చి 4 : కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఎటువంటి సందేహాలు అవసరం లేదని, నిర్భయంగా ముందుకు రావాలని సబ్‌ కలెక్టర్‌ నారపరెడ్డి మౌర్య సూచించారు. గురువారం ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలవేణి సమక్షంలో వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అనం తరం ఆమె మాట్లాడుతూ వాక్సిన్‌పై తప్పుడు వదంతులు నమ్మవద్దన్నారు. అంతా కొవిడ్‌ నిబం ధనలు పాటించాలని ఆమె పేర్కొన్నారు. జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ నళినీప్రసాద్‌, స్టాఫ్‌నర్సు రత్నం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T06:26:58+05:30 IST