Viral Video: అడ్డదిడ్డంగా కారు పార్క్ చేశారని.. దిమ్మతిరిగే స్థాయిలో ప్రతీకారం తీర్చుకున్నారు!

ABN , First Publish Date - 2022-02-07T02:15:24+05:30 IST

సూచించిన స్థలంలో కారు పార్కు చేయకుండా కొందరు అడ్డదిడ్డంగా కారును నిలుపుతుంటారు. ఇతరులు ఇబ్బంది పడతారన్న విషయాన్ని కూడా వారు పట్టించుకోరు. అలాంటి ఓ వ్యక్తికి స్థానికులు గుణపాఠం చెప్పిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Viral Video:  అడ్డదిడ్డంగా కారు పార్క్ చేశారని.. దిమ్మతిరిగే స్థాయిలో ప్రతీకారం తీర్చుకున్నారు!

ఇంటర్నెట్ డెస్క్:  అమెరికాలో పెద్దపెద్ద సూపర్ మార్కెట్లు ఉంటాయి. అక్కడికొచ్చే వాహనాల కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు ఇంకా పెద్దగా ఉంటాయి. ఏ కారు ఎక్కడ నిలపాలో సూచించే చిహ్నాలు కూడా ఉంటాయి. కానీ.. సూచించిన స్థలంలో కారు పార్కు చేయకుండా కొందరు అడ్డదిడ్డంగా కారును నిలుపుతుంటారు. ఇతరులు ఇబ్బంది పడతారన్న విషయాన్ని కూడా వారు పట్టించుకోరు. అలాంటి ఓ వ్యక్తికి స్థానికులు గుణపాఠం చెప్పిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. 


వీడియోలో చూపించిన దాని ప్రకారం.. ఆ సూపర్ మార్కెట్‌కు వచ్చిన ఇతర వినియోగదారులు.. అతడు అడ్డదిడ్డంగా పార్క్ చేసిన మెర్సిడెజ్ బెంజ్ కారు మళ్లీ కదల్చడానికి వీలు లేకుండా దాని చుట్టూ షాపింగ్ ట్రాలీలను పేర్చారు. అంతేకుండా.. ‘‘ఇలా కారు పార్క్ చేయకూడదు.. ’’ అంటూ నేలపై నాలుగు శాపనార్థాలు కూడా రాశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే.. ఈ వీడియో చూసిన కొందరు మాత్రం మరీ ఈ స్థాయిలో రివేంజ్ తీర్చుకోవడం అనవసరమని అభిప్రాయపడ్డారు. మనం ఊహించలేని కారణమేదో అతడు ఇలా చేయడానికి దారి తీసి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. మరీ ఇంత నాటకీయంగా ప్రతీకారం తీర్చుకోవడం అవసరమా అని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇలా భిన్నాభిప్రాయాల మధ్యే ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. 



Updated Date - 2022-02-07T02:15:24+05:30 IST