ఒత్తిడి తగ్గించే ఫ్రూట్స్‌!

ABN , First Publish Date - 2021-05-18T05:13:15+05:30 IST

ఒత్తిడిని వదిలించడంలో తాజా పండ్లు, కూరగాయలు కూడా సమర్ధమైనవే! ఎడిత్‌ కొవాన్‌ యూనివర్శిటీ అధ్యయనకారులు చేపట్టిన ఓ అధ్యయనంలో పండ్లు, కూరగాయలతో కూడిన సమతులాహారం తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని తేలింది

ఒత్తిడి తగ్గించే ఫ్రూట్స్‌!

ఒత్తిడిని వదిలించడంలో తాజా పండ్లు, కూరగాయలు కూడా సమర్ధమైనవే! ఎడిత్‌ కొవాన్‌ యూనివర్శిటీ అధ్యయనకారులు చేపట్టిన ఓ అధ్యయనంలో పండ్లు, కూరగాయలతో కూడిన సమతులాహారం తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని తేలింది. పండ్లు, కూరగాయలు, ఒత్తిడికీ మధ్య ఉన్న లింక్‌ గురించి తెలుసుకోవడం కోసం 25 నుంచి 91 ఏళ్ల మధ్య ఉన్న 8,600 మంది ఆస్ర్టేలియన్ల మీద ప్రయోగాలు చేపట్టినట్టు క్లినికల్‌ న్యూట్రిషన్‌ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో వెల్లడించారు. 230 గ్రాముల పండ్లు, కూరగాయలు తిన్నవారి కంటే 470 గ్రాముల పండ్లు, కూరగాయలు తిన్న వ్యక్తుల ఒత్తిడి 10 శాతం తక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనాల్లో తేలింది. కాబట్టి ఒత్తిడి అదుపులో ఉండాలంటే ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 400 గ్రాములకు తగ్గకుండా పండ్లు, కూరగాయలు తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.

Updated Date - 2021-05-18T05:13:15+05:30 IST