ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు

ABN , First Publish Date - 2022-08-16T06:02:38+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలను అందజేస్తూ పేదల ఆర్థిక పరిపుష్టికి చేయూతనిస్తోందని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు.

ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు
జాతీయ జెండాను ఆవిష్కరింస్తున్న ప్రభుత్వ విప్‌ గొంగిడి సునిత

జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి 

భువనగిరి రూరల్‌, ఆగస్టు 15: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలను అందజేస్తూ పేదల ఆర్థిక పరిపుష్టికి చేయూతనిస్తోందని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, కలెక్టర్‌ పమే లా సత్పథితో కలిసి కలెక్టరేట్‌ ఆవరణలో 75వ స్వాతంత్య్ర దినోత్సవంలో  సోమవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. వారిని స్మరించుకునేందుకు ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రాష్ట్ర మంతటా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీ య పతాకాన్ని ఎగురవేసే విధంగా జిల్లాకు వచ్చిన 2లక్షల60వేల జాతీయ పతాకాలను జిల్లా, మండ ల, గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికీ అందజేసి జాతీయ పతాకాన్ని ఎగరవేశారని చెప్పారు.

జిల్లాలో 2022సంవత్సరంలో వానాకాలం సీజన్‌లో రైతులు 4,54,049ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేశారని, రైతుబంధు కింద వానా కాలంలో 2,54,977మంది రైతులకు రూ.293.10 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. 

రైతు బీమా ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు మృతిచెంది న 2,395మంది రైతు కుటుంబాలకు రూ.119.75కోట్లు నామిని ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు.  

15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.46.55కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల ద్వారా మొత్తం రూ.38.59కోట్లు గ్రామ పంచాయతీలకు విడుదల చేసినట్లు తెలిపారు. 

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 421 గ్రా మ పంచాయతీల్లో ట్రాక్టర్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. పట్టణ ప్రగతి పథకం కింద మునిసిపా లిటీలకు మంజూరైన రూ.4.58కోట్ల గ్రీన్‌ బడ్జెట్‌ నిధుల్లో రూ.కోటి వినియోగిం చినట్లు తెలిపారు. 

ఏప్రిల్‌ 2022 నుంచి జిల్లాలో 20,626మందికి కొవిడ్‌ ప రీక్షలు చేయగా 329మందికి పాజిటివ్‌ రాగా వారిని హోం ఐ సోలేషన్‌లో చికిత్స చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 20,9 62మంది బాలింతలకు కేసీఆర్‌ కిట్లు అందించినట్లు తెలిపారు. 

మిషన్‌ భగీరథ ద్వారా ప్రజలకు సురక్షిత తాగు నీరు అందించేందుకు జిల్లాలోని 547ఆవాసాలకు గోదావరి నీటిని, 145ఆవాసాలకు కృష్ణా నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 

జిల్లాలోని 641ప్రభుత్వ పాఠశాలలు, 762అంగన్‌వాడీ కేంద్రాలకు నల్లా కనెక్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 261 వైకుంఠా ధామాలకు ఇప్పటి వరకు నీటి సౌక ర్యం కల్పించామని, మిగిలిన వైకుంఠధామాల పనులు ప్రగతి లో ఉన్నాయని తెలిపారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్యాకేజీ 15పనులు 60శాతం పూర్తయ్యాయని, ప్రధాన కాల్వ పురోగతిలో ఉందని పేర్కొన్నారు. 

ప్యాకేజీ 16పనులు 58శాతం పూర్తయ్యాని, నృసింహ సాగర్‌(బస్వాపూర్‌) ప్రాజెక్టు 11.39టీఎంసీ సామర్థ్యంతో లక్షా 11వేల641 ఎకరాలకు సాగునీరు కల్పించేందుకు గాను పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. 

ఆలేరు, భువనగిరి నియోజకవర్గ పరిధిలో రెండు సం చార పశువైద్య శాలలు పని చేస్తున్నాయన్నారు. జిల్లాలోని 134మత్స్యపారిశ్రామిక సంఘాలు, 10 మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలలో 8,929మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారన్నారు. 

నేతన్నకు చేయూత పథకం కింద 5,442 మంది చేనేత కార్మికులకు రూ.21.48కోట్లు సాయం మంజూరు చేసినట్లు తెలిపారు. 

జిల్లా కేంద్ర సహకార బ్యాం కు ద్వారా 10 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.4.52 కోట్లు క్యాష్‌ క్రెడిట్‌ రూపంలో మంజూరు చేసినట్లు తెలిపారు. 

దళితబంధు పథకం కిం ద తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో 76దళిత కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున రూ.7.60 కోట్లు విడుదల చేసినట్లు తెలిపా రు. దళితుల ఆర్థిక అభివృద్ధికి దో హదపడే ఈ పథకం జిల్లా నుంచి ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. 

57సంవత్సరాలు నిండిన వారికి నూతనంగా జిల్లా నుంచి 25వేల మంది లబ్దిదారులకు పింఛన్లు మంజూరు అయినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ పి. యాదగిరి, అదనపు కలెక్టర్లు శ్రీనివా్‌సరెడ్డి, దీపక్‌ తివారి, డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌రెడ్డి, ఆర్డీవో ఎంవీ. భూపాల్‌రెడ్డి, సీఈవో సీహెచ్‌. కృష్ణారెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు ఎనబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్య, గ్రంథాలయ, రైతు సమన్వయ సమితి, ఏఎంసీ చైర్మన్లు జడల అమరేందర్‌, కొలుపుల అమరేందర్‌, ఎడ్ల రాజేందర్‌రెడ్డి, డీఏవో మందడి ఉపేందర్‌రెడ్డి, కలెక్టరేట్‌ ఏవో ఎం.నాగేశ్వరచారి, అదనపు డీఆర్‌డీవో టి.నాగిరెడ్డి, గుత్తా నరేందర్‌రెడ్డి, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, వైస్‌ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, ప్రజా సంఘాల ప్రతినిధులు సత్తిరెడ్డి, బట్టు రామచంద్రయ్య, సుదర్శన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-16T06:02:38+05:30 IST