పండ్ల ఆకృతుల్లో బస్టాపులు!

ABN , First Publish Date - 2021-02-24T05:59:12+05:30 IST

మన దగ్గర బస్టాపు అంటే పైన రేకులు, విరిగిపోయి, దుమ్ము పట్టిన కుర్చీలు... ఇవే గుర్తొస్తాయి. కానీ జపాన్‌లోని కొనగై అనే పట్టణంలో మాత్రం రకరకాల పండ్ల ఆకారాల్లో, అందంగా అలంకరించిన బస్టాపులు దర్శనమిస్తాయి...

పండ్ల ఆకృతుల్లో బస్టాపులు!

మన దగ్గర బస్టాపు అంటే పైన రేకులు, విరిగిపోయి, దుమ్ము పట్టిన కుర్చీలు... ఇవే గుర్తొస్తాయి. కానీ జపాన్‌లోని కొనగై అనే పట్టణంలో మాత్రం రకరకాల పండ్ల ఆకారాల్లో, అందంగా అలంకరించిన బస్టాపులు దర్శనమిస్తాయి. ఆ విశేషాలు ఇవి...


  1. ప్రయాణికులను ఆకర్షించడానికి అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగానే కొనగై పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో రకరకాల పండ్ల ఆకారాల్లో బస్టాపులను నిర్మించారు.
  2. వాటిని చూస్తే కాసేపైనా బస్టాపులో కూర్చోవాలని అనిపించకమానదు. వాటర్‌మెలన్‌, స్ట్రాబెర్రీ, ఆరెంజ్‌... ఇలా రకరకాల పండ్ల ఆకృతుల్లో బస్టాపులు కనిపిస్తుంటాయి. ఆ పట్టణంలో ఈ తరహా బస్టాపులు దాదాపు పదహారు ఉన్నాయి. 

Updated Date - 2021-02-24T05:59:12+05:30 IST