రూ. 30 వేల మామిడి లూటీ... ఎనిమిది ల‌క్ష‌ల‌కు మించిన ఆర్థిక సాయం!

ABN , First Publish Date - 2020-05-24T17:47:32+05:30 IST

దేశ ‌రాజ‌ధాలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. జగత్‌పురి చంద్ర నగర్ ప్రాంతంలో మియాన్ అనే పండ్ల వ్యాపారికి చెందిన‌ రూ. 30 వేలు విలువైన‌ మామిడి పండ్లు లూటీ అయ్యాయి. దీనికి సంబంధించిన...

రూ. 30 వేల మామిడి లూటీ... ఎనిమిది ల‌క్ష‌ల‌కు మించిన ఆర్థిక సాయం!

న్యూఢిల్లీ: దేశ ‌రాజ‌ధానిలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. జగత్‌పురి చంద్ర నగర్ ప్రాంతంలో ఫూల్ మియా అనే పండ్ల వ్యాపారికి చెందిన‌ రూ. 30 వేలు విలువైన‌ మామిడి పండ్లు లూటీ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. దీంతో దేశం న‌లుమూల‌ల నుంచి అత‌నికి ఆర్థి‌క సాయం చేసేందుకు ప‌లువురు ముందుకు వ‌చ్చారు. ఈ విధంగా ఫూల్ మియా‌కు రూ. 8 ల‌క్ష‌ల రూపాయ‌ల సాయం అందింది. మియా ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయాయి. దీంతో మియా త‌న‌కు సాయం అందించిన వారికి కృతజ్ఞతలు తెలియ‌జేస్తూ, ఇప్పుడు ఎంతో ఆనందంగా ఈద్ చేసుకుంటాన‌ని తెలిపాడు. వివ‌రాల్లోకి వెళితే ఫూల్ మియా ‌త‌న కుటుంబంతో సహా జగత్‌పురిలో ఉంటున్నాడు. బుధ‌వారం బండిపై మామిడి పండ్లు విక్ర‌యిస్తుండ‌గా, ద‌గ్గ‌ర‌లో రెండు వర్గాలు గొడ‌వ ప‌డుతున్నాయి. ఇంత‌లో ఒక గ్రూపువారు అత‌ని ద‌గ్గ‌రున్న ఒక మామిడిపండ్ల ట్రేను లాక్కుపోయారు. దీనిని గ‌మ‌నించిన అక్క‌డున్న‌వారు మిగిలిన పండ్ల‌ను లూటీ చేశారు. దీంతో మియా రూ. 30 వేల రూపాయ‌ల విలువైన మామిడి పండ్ల‌ను న‌ష్టపోయాడు. అయితే జ‌నం అత‌ని ద‌గ్గ‌ర మామిడి పండ్ల‌ను దోచుకుంటున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసివారు మియా‌కు సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. రూ. 30 వేల రూపాయల నష్టం వ‌చ్చింద‌ని క‌ల‌త చెందుతున్న మియా‌కు ఇప్పుడు ఎనిమిది ల‌క్ష‌ల రూపాయ‌ల మేర‌కు సాయం అందింది.  

Updated Date - 2020-05-24T17:47:32+05:30 IST