నేలపై చిందరవందరగా రష్యా సైనికుల మృతదేహాలు.. వాటి పని కుక్కలు చూసుకుంటాయన్న ఉక్రెయిన్ సైన్యం

ABN , First Publish Date - 2022-03-12T00:09:05+05:30 IST

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి

నేలపై చిందరవందరగా రష్యా సైనికుల మృతదేహాలు.. వాటి పని కుక్కలు చూసుకుంటాయన్న ఉక్రెయిన్ సైన్యం

కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వేలాది మంది సైనికులను కోల్పోతున్నాయి. నష్టం అంచనాకు అందనప్పటికీ యుద్ధం నుంచి వెనక్కి తగ్గేందుకు మాత్రం రష్యా ససేమిరా అంటోంది. తమ లక్ష్యాలను సాధించే వరకు వెనకడుగు వేయబోమని తేల్చి చెబుతోంది. మరోవైపు, తాము వేలాదిమంది రష్యా సైనికులను హతమార్చామని ఉక్రెయిన్ చెబుతోంది.


ఖార్కివ్ నగరం సమీపంలో నేలపై చిందరవందరగా పడివున్న రష్యా సైనికుల మృతదేహాల గురించి బీబీసీ కరస్పాండెంట్ ఒకరు ఉక్రెయిన్ సైనికులను ప్రశ్నించినప్పుడు నివ్వెరపోయే సమాధానం చెప్పారు. ‘‘ఏం జరుగుతుందని అనుకుంటున్నారు? వాటిని మేం కుక్కలకు ఆహారంగా వదిలేస్తాం’’ అని బదులిచ్చారు. తాము తమ భూభాగం, కుటుంబాలను రక్షించుకునేందుకు పోరాడుతున్నట్టు మరో సైనికుడు బదులిచ్చాడు. 


Updated Date - 2022-03-12T00:09:05+05:30 IST