బ్రెజిల్ నుంచి వచ్చిన ఫ్రోజెన్ చికెన్‌లో కరోనా వైరస్ : చైనా

ABN , First Publish Date - 2020-08-13T22:46:42+05:30 IST

దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని

బ్రెజిల్ నుంచి వచ్చిన ఫ్రోజెన్ చికెన్‌లో కరోనా వైరస్ : చైనా

బీజింగ్ : దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని చైనా హెచ్చరించింది. బ్రెజిల్ నుంచి వచ్చిన ఫ్రోజెన్ చికెన్ వింగ్స్‌ను పరీక్షించినపుడు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్థరణ అయిందని పేర్కొంది. 


చైనాలోని షెంజెన్ లోకల్ గవర్నమెంట్ ఓ ప్రకటనలో వెల్లడించిన వివరాల ప్రకారం, చైనాలోని కొన్ని నగరాల్లో గతంలో ఇంపోర్టెడ్ ఫ్రోజెన్ సీఫుడ్ ప్యాకేజింగ్‌ పైభాగంలో కోవిడ్-19 వైరస్ కనిపించింది. తాజాగా మాంసం పై భాగంలోనే ఈ వైరస్ కనిపించింది.


ఈ మాంసాన్ని బ్రెజిల్‌లోని శాంటా కేటరినాలోని అరోరా అలిమెంటోస్ ప్లాంట్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ప్రజలు ఇటువంటి సీఫుడ్, ఆక్వా ఫుడ్ కొనేటపుడు జాగ్రత్తలు పాటించాలని షెంజెన్ లోకల్ గవర్నమెంట్ తెలిపింది. 


Updated Date - 2020-08-13T22:46:42+05:30 IST