పట్నం నుంచి పల్లెకు..

ABN , First Publish Date - 2021-10-15T04:50:17+05:30 IST

పట్నం నుంచి పల్లెకు..

పట్నం నుంచి పల్లెకు..
ఘట్‌కేసర్‌లో ప్రయాణికుల రద్దీ

  • దసరా పండుగకు సొంతూళ్లకు తరలిన జనం
  • ప్రయాణికులతో కిక్కిరిసిన బస్సులు, రైళ్లు

ఘట్‌కేసర్‌/మేడ్చల్‌ :బతుకుదెరువు కోసం వచ్చి నగర పరిసరాల్లో  నివాసం ఉండే ప్రజలంతా దసరా పండుగకు పల్లెబాట పట్టారు. స్వగ్రామాలకు వెళ్లేందుకు తరలారు.  దీంతో బస్సులు, లారీలు, ఆటోలు, రైళ్లు కిక్కిరిసి పోయాయి. ప్రధానంగా నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట్‌, జనగాం, వరంగల్‌ తదితర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో  ఘట్‌కేసర్‌లోని పాత జాతీయ రహదారి రెండు రోజులుగా కిక్కిరింది. బస్టాండు ప్రయాణికులతో కిటకిట లాడుతున్నది.  ప్రయాణికులకు అనువుగా తగినన్ని ఆర్టీసీ బస్సులకు అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రతి సంవత్సరంలాగే ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. చేసేది లేక ప్రజలు అటోలు, లారీలలోనూ ప్రయాణాలు సాగించారు. బస్సులు, రైళ్లు నగరం నుంచే నిండి వస్తుండటంతో ఘట్‌కేసర్‌లో బస్సులు ఆపినా ప్రయోజనం లేకుండా పోయింది, వృద్ధులు, పిల్లలు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించి తీవ్ర ఇబ్బందులకు గుర య్యారు. వరంగల్‌, జనగాం జిల్లాలకు వెళ్లాల్సిన బస్సులు తగినన్ని రాపోవడంతో భువనగిరిలో దిగి, తిరిగి అక్కడ మరో బస్సెక్కి వెళ్లాల్సి వచ్చిందని పలువురు ప్రయాణికులు వాపోయారు. దీంతో అదనపు చార్జీలతో పాటు సమయం వృథా అవుతున్నదని వాపోయారు. కాగా మేడ్చల్‌ డిపో వద్ద  ప్రయాణికుల రద్దీ కనిపించింది. స్వగ్రామాలకు వెళ్లే వారితో డిపో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి

 పూల ధరలకు రెక్కలు

 దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం మేడ్చల్‌ మార్కెట్‌ రోడ్లన్ని కిక్కిరిసిపోయాయి. మే డ్చల్‌ ప్రధాన మార్కెట్‌ రోడ్డు పూర్తిగా గుమ్మడికాయలు, బంతిపూలు, మామిడిఆకులు తదితర వాటితో నిండిపోయి ంది. మరోవైపు వీటిని కొనుగోలు చేసేందుకు వచ్చే వారితో మేడ్చల్‌ మార్కెట్‌లో కనీసం నడుచుకుంటూ ముందుకువెళ్లలేని పరిస్థితి నెలకొంది. డిపోముందు నుంచి జాతీయరహదారి పక్కనే గల సర్వీసు వివేకానంద చౌరస్తా మీదు గా నాలుగు రోడ్ల చౌరస్తా వరకు రోడ్డుకిరువైపులా చిరువ్యాపారులు దసరా పండుగకు కొనుగోలు చేసే వస్తు సా మగ్రితో నింపేశారు. మార్కెట్‌లో ఎటుచూసినా పండుగ సందడి నెలకొంది.  పరిసర ప్రాంతాల నుంచి వ్యాపారు లు వాహనాల్లో బంతిపూలను తీసుకువచ్చి మేడ్చల్‌ ఐటీఐ నుంచి చెక్‌పోస్టు వరకు జాతీయరహదారి పక్కనే విక్రయి ంచసాగారు. కిలో బంతిపూలు రూ.150 వరకు విక్రయించారు. కాగా ఒక్కరోజు ముందే మేడ్చల్‌లో దసరా పండుగ వాతావరణం కనిపించింది. వ్యాపారులు తమ దుకాణాల కు మామిడి తోరణాలు, బంతిపూలను కట్టి  పూజకు ఏర్పా ట్లు చేసుకున్నారు. మేడ్చల్‌లోని ఏడుగళ్ల ఆలయం వద్ద, చెరువు కట్టపై గల అమ్మవారి ఆల యం వద్ద, గడిమైసమ్మ ఆలయం వద్ద వాహనదారు లు తమ వాహనాలకు పూజలు నిర్వహించారు. 

Updated Date - 2021-10-15T04:50:17+05:30 IST