రేపటినుండి... ‘హాల్‌మార్క్’ లేకుండా బంగారం విక్రయిస్తే చర్యలు...

ABN , First Publish Date - 2021-06-14T20:52:17+05:30 IST

బంగారం హాల్‌మార్కింగ్ రేపటి(మంగళవారం, జూన్ 15) నుండి తప్పనిసరి కానుంది. ఇంతకుముందు ఈ గడువు జూన్ 1 కాగా, దీనిని మరో పదిహేను రోజులు పొడిగించిన విషయం తెలిసిందే.

రేపటినుండి... ‘హాల్‌మార్క్’ లేకుండా బంగారం విక్రయిస్తే చర్యలు...

న్యూఢిల్లీ : బంగారం హాల్‌మార్కింగ్ రేపటి(మంగళవారం, జూన్ 15) నుండి తప్పనిసరి కానుంది. ఇంతకుముందు ఈ గడువు జూన్ 1 కాగా, దీనిని మరో పదిహేను రోజులు పొడిగించిన విషయం తెలిసిందే. కేంద్రం గోల్డ్ జ్యువెల్లరీ హాల్ మార్కింగ్ నిబంధనల అమలును గతంలోనూ పలుమార్లు పొడిగించిన విషయం తెలిసిందే.


ఈ ఏడాది జనవరిలో గోల్డ్ హాల్ మార్కింగ్ నిబంధనలు అమల్లోకి రావాల్సి ఉడగా... కరోనా నేపధ్యంలో ఈ గడువును జూన్ 1వ తేదీ వరకు, ఆ తర్వాత జూన్ 15కు పొడిగించారు. హాల్‌మార్క్ లేకుండా రేపటి నుండి బంగారు ఆభరణాలు విక్రయించినపక్షంలో చట్టరీత్యా చర్యలుంటాయని అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2021-06-14T20:52:17+05:30 IST