జొన్నవాడలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు

ABN , First Publish Date - 2022-09-26T04:50:25+05:30 IST

మండలంలోని జొన్నవాడలో ఉన్న కామాక్షితాయి అమ్మవారికి శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం కలశస్థాపనతో ప్రారంభమవుతాయి.

జొన్నవాడలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు
విద్యుత్‌ కాంతుల్లో జొన్నవాడ ఆలయం

బుచ్చిరెడ్డిపాళెం, సెప్టెంబరు 25:  మండలంలోని జొన్నవాడలో ఉన్న కామాక్షితాయి అమ్మవారికి శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం కలశస్థాపనతో ప్రారంభమవుతాయి. 27న త్రిపురాంబికాదేవి అలంకారం, 28న రక్తబీజవధ, 29న మధుకైటభవధ, 30న రాజరాజేశ్వరి, 1న భండాసురవధ, 2న సరస్వతి, 3న దుర్గాదేవి, 4న మహిషాసురమర్దని అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు.  అక్టోబరు 5న విజయదశమితో ఉత్సవాలు ముగుస్తాయి. ఇప్పటికే ఆలయంలో జిల్లాతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు దీక్షబూని ఉదయం, సాయంత్రం స్వామి, అమ్మవార్ల సేవలో తరిస్తున్నారు. ఆలయం రంగులు, విద్యుద్దీపాలంకరణతో ముస్తాబైంది.

భక్తులకు సౌకర్యాలు

ఆలయ చైర్మన్‌ పుట్టా, ఏసీ, ఈవో డబ్బుగుంట

ఉత్సవాలకు జిల్లా, రాష్ట్రం, ఇతర రాష్ర్టాలనుంచి తరలి వచ్చే అశేష భక్తజనానికి అన్ని విధాలా  వసతులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆలయ చైర్మన్‌ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు, ఏసీ,ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం వారు మాటా ్లడుతూ తాగునీరు, భోజన, ఉచిత ప్రసాదాలు, పారిశుధ్యం, ఆలయంలో నిద్రించేందుకు చలువపందిళ్లతోపాటు పలు వసతులు ఏర్పాటు చేస్తున్నట్టు  తెలిపారు. అలాగే దీక్షబూని భక్తులకు రాత్రి వేళ అల్పాహార సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు. భక్తుల కోసం ఆలయం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

పొదలకూరు : పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆల యంలో  సోమవారం నుంచి శరన్నవరాత్రి మహో త్సవా లు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 8 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు ఆదూరు వెం కట సుబ్బులు ఆదివారం ఒక ప్రకటనలో  తెలిపారు. 

తోటపల్లిగూడూరు : మండలంలోని వరిగొండ గ్రామంలో ఉన్న జ్వాలా ముఖి అమ్మవారి దేవస్థానంలో ఈనెల 26 నుంచి అక్టోబరు 5వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహో త్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తల మండలి చైర్మన్‌ కోసూరు రవీంద్ర, ఆలయ కార్య నిర్వహణ అధికారి తాత శ్రీనివాసరావు, అర్చకులు బి.మోహన్‌కృష్ణశర్మ తెలిపారు.

Updated Date - 2022-09-26T04:50:25+05:30 IST