నేటి నుంచి ‘మన నది-మన నుడి’: పవన్‌

ABN , First Publish Date - 2020-09-27T08:53:09+05:30 IST

నేటి నుంచి ‘మన నది-మన నుడి’: పవన్‌

నేటి నుంచి ‘మన నది-మన నుడి’: పవన్‌

అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ‘‘నేటి నుంచి ఐదు రోజులపాటు ‘మన నది - మన నుడి’ ఆన్‌లైన్‌ ఆధారిత కార్యక్రమం చేపడుతున్నాం. పలువురు వక్తలు వివిధ అంశాలపై ప్రజలను చైతన్యపరచడానికి ప్రసంగిస్తారు. ఈ మొత్తం కార్యక్రమాలను జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య నిర్వహిస్తారు’’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన చేశారు. కార్యక్రమాన్ని జనసేన సోషల్‌ మీడియా వేదికలపై వీక్షించవచ్చని పవన్‌ తెలిపారు.


జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియ

జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభమైంది. ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్‌, అనంతపురం అర్బన్‌లో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు పవన్‌ కల్యాణ్‌ రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 


బీజేపీ కార్యవర్గం సభ్యులకు అభినందనలు

‘బీజేపీ జాతీయ కార్యవర్గంలో నియమితులైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను’ అని పవన్‌  కల్యాణ్‌ ఓ ప్రకటన చేశారు.

Updated Date - 2020-09-27T08:53:09+05:30 IST