Advertisement

ఖరీదైన కార్లు పాత ముచ్చట.. ఇప్పుడు Private Jet ఉన్నోడే కింగ్.. Bollywood లో ఎవరెవరికి ఉన్నాయంటే..

చాలా మందికి విమానం ఎక్కాలనే కల ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఫ్లైట్ ఎక్కేయగలుగుతున్నారు కూడా. కానీ, దాదాపుగా సామాన్యులెవరూ కలగనటానికి కూడా సాహసించనిది ఒకటుంది! అదే... ‘స్వంతంగా విమానం కొనుక్కుందాం’ అని ఆలోచించటం! 


ఓన్ టూ వీలర్, ఓన్ ఫోర్ వీలర్ మామూలే... కానీ, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే బాలీవుడ్ బిగ్ సెలబ్రిటీలకు ఏకంగా విమానాలే ఉన్నాయి. ‘ప్రైవేట్ జెట్స్’గా పిలవబడే వీటి ఖరీదు కోట్లలో కాదు... వందల కోట్లలో ఉంటుంది. అయినా ఏడుగురు క్రేజీ బీ-టౌన్ బిగ్ షాట్స్ కొనేశారు. ప్రపంచంలోని చాలా దేశాలకు స్వంత విమానాల్లో వారు చక్కర్లు కొడుతుంటారు కూడా.

బాలీవుడ్ బాద్షా అన్న టైటిల్‌కి తగ్గట్టుగా రారాజులా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తాడు, షారుఖ్ ఖాన్. అయితే, కింగ్ ఖాన్‌కి విదేశాల్లో వెకేషన్స్ ఎంజాయ్ చేయటం సరదా. అందుకే, ఓ ప్రైవేట్ విమానం కొనేశాడు. దాంట్లో తరచూ దుబాయ్ వెళ్లి వస్తుంటాడు, ఖాన్ తన ఖాన్‌దాన్‌తో...

ఒకప్పుడు హోటల్లో వెయిటర్ అయితే మాత్రం ఏంటి... ఇప్పుడు బాలీవుడ్‌లో ఎందరో నిర్మాతలు అదేపనిగా వెయిట్ చేసే, అత్యంత బిజీ యాక్టర్ అక్షయ్ కుమార్. అందుకే, తన ప్రయాణాలకి, ఫ్యామిలీతో వేసే వరల్డ్ టూర్స్‌కి టైం వేస్ట్ కాకుండా ప్రైవేట్ జెట్ కొనేశాడు. ప్రధానంగా కెనడా దేశానికి పలుమార్లు వెళ్లి వస్తుంటాడు ఖిలాడీ కుమార్...


గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన మన దేసీ గాళ్ ప్రియాంక గురించి కొత్తగా చెప్పేదేముంది? ఇవాళ్ల ఇక్కడుంటే రేపు లాస్ ఏంజిలిస్, మర్నాడు లండన్ అన్నట్టు కొనసాగుతోంది ఆమె జీవితం! అందుకే, యూఎస్‌లోని అత్తారిల్లు, భారత్‌లోని పుట్టిల్లు... రెండిటి మధ్యా తన స్వంత విమానంలో ప్రయాణిస్తుంటుంది మిసెస్ జోనాస్. 

బిగ్ బిగా ఎదిగిన అమితాబ్ బచ్చన్‌కు ప్రైవేట్ జెట్ ఉండటం... బిగ్ సర్‌ప్రైజ్ అంటారా? కానేకాదు! అయితే, ఆయనకు స్వంత జెట్ ఉందని మాత్రం కొన్నాళ్ల క్రితమే కన్‌ఫర్మ్ అయింది. సీనియర్ బచ్చన్‌కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వచ్చినప్పుడు జూనియర్ బచ్చన్ ఓ ఫోటో షేర్ చేశాడు. అందులో అమితాబ్, జయా బచ్చన్లతో అభిషేక్ ఉన్నాడు. అయితే, ఆ స్టిల్... బచ్చన్ ఫ్యామిలీ స్వంత విమానంలోనిది కావటం చాలా మంది దృష్టిని ఆకర్షించింది...


పోర్న్ వీడియోల కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్లి బెయిల్ మీద బయటకొచ్చిన రాజ్ కుంద్రాకి కూడా జెట్ ఉంది. తమ స్వంత వాహనంలో గాల్లో తేలిపోతూ దేశదేశాలు తిరిగారు మిష్టర్ అండ్ మిసెస్ కుంద్రా. కాకపోతే, సమీప భవిష్యత్తులో శిల్పా తన భర్తతో కలసి వెకేషన్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తుందో, మనమైతే చెప్పలేం. పోర్నోగ్రఫీ కేసు శిల్పా శెట్టి కుటుంబంలో బాగానే రచ్చకి కారణమైందట...


బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో తప్పక వినిపించే సీనియర్ జోడీ అజయ్ దేవగణ్ అండ్ కాజల్. వీరికి కూడా ఓ సిక్స్ సీటర్ ప్రైవేట్ జెట్ ఉందట. అజయ్, కాజల్ దేవగణ్ తమ కొడుకు, కూతురుతో కలసి రెగ్యులర్‌గా ఫారిన్ టూర్స్ వేస్తుంటారని బాలీవుడ్ టాక్.  


Advertisement