May 11 2021 @ 18:34PM

మే 21న ‘ఆహా’లో ‘ప్లే బ్యాక్’

దినేశ్ తేజ్‌, వ‌కీల్ సాబ్ ఫేమ్ అన‌న్య నాగ‌ళ్ల, టి.ఎన్‌.ఆర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందిన ఎంగేజింగ్ థ్రిల్ల‌ర్ మూవీ ‘ప్లే బ్యాక్’. ఈ చిత్రం  మే 21నుంచి తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో ప్ర‌సార‌మ‌వుతుంది. జ‌క్కా హ‌రి ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు. క్రైమ్ రిపోర్ట‌ర్(2019లో)కి,, సుజాత అనే అమ్మాయి(1993లో)కి మ‌ధ్య జ‌రిగే టెలిఫోన్ సంభాష‌ణ చుట్టూ ఈ థ్రిల్ల‌ర్ మూవీ న‌డుస్తుంది. ప‌లు ట్విస్టులు, ట‌ర్న్స్‌తో రెండు వేర్వేరు కాలాల‌కు చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు (2019లోని అబ్బాయి..1993లోని అబ్బాయి) మ‌ధ్య న‌డిచే థ్రిల్ల‌ర్ అంశాల‌తో న‌డిచే సినిమా ఇది. 

ప్ర‌ముఖ దివంగ‌త జ‌ర‌ల్నిస్ట్‌, న‌టుడైన టి.ఎన్‌.ఆర్‌లోని ఫెర్పామ‌ర్‌ను స‌రికొత్త కోణంలో ఎలివేట్ చేసిన చిత్ర‌మిది. ఆయ‌న పోషించిన పాత్ర‌ల్లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ రోల్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ ఏడాది ప్రారంభంలో.. విడుద‌లైన ఈ సినిమా, కె.బుజ్జి అందించిన సినిమాటోగ్ర‌ఫీ, క‌మ్రాన్ గ్రిప్పింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ‘ప్లే బ్యాక్’ చిత్రం ప్రేక్ష‌కులే కాదు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. 

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...