రైతు గోస!

ABN , First Publish Date - 2020-06-07T11:10:53+05:30 IST

తిండి, తిప్పలుమాని మూడు రోజులుగా రైతులు జొన్నలు విక్రయించేందుకు పడిగాపులు కాస్తున్నారు. ఎండ, వానా సైతం లెక్క చేయకుండా

రైతు గోస!

నాలుగు రోజులుగా కేంద్రం వద్ద పడిగాపులు

ఇంకా చేతికి రాని రశీదులు

కనీసం తాగునీరు కరువు

లారీల్లో లోడ్‌ అయ్యే వరకూ రైతులు ఉండాలని అధికారుల ఆదేశం


తాంసి, జూన్‌ 6: తిండి, తిప్పలుమాని మూడు రోజులుగా రైతులు జొన్నలు విక్రయించేందుకు పడిగాపులు కాస్తున్నారు. ఎండ, వానా సైతం లెక్క చేయకుండా జొన్న కుప్పల వద్దనే ఉంటున్నారు జోన్నలు విక్రయించేందుకు వచ్చిన రైతులకు కొనుగోలు కేంద్రం వద్ద కనీసం తాగునీరు సైతం దొరకడం లేదు. వివరాలు ఇలా ఉన్నాయి.. తాంసి మండల కేంద్రంలో ఈ నెల 3న జొన్నల కొనుగోళ్లు ప్రారంభించారు ప్రతిరోజూ కొన్ని గ్రామాల చొప్పున ఎంపిక చేసి కొనుగోలు చేపట్టారు. నాలుగు రోజుల నుంచి జొన్నలు తీసుకు వచ్చిన రైతులు అక్కడే నిరీ క్షిస్తున్నారు. వారి కుప్పపై కూర్చొని కాపల కాస్తున్నారు. కొంతమంది రైతుల జొన్నలు తూకం అయినప్పటికీ ఆ బస్తాలు లారీల్లో లోడ్‌ అయ్యే వరకూ సంబంధిత రైతులదే బాధ్యత అని అధికారులు ఆదేశా లు జారీచేస్తున్నారు. తూకం వెంటనే రశీదులు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వ డం లేదని రైతులు వాపోతున్నారు. 


కనీస సౌకర్యాలు కరువు

కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు సైతం లేవు. ప్రతీ రైతుకు పాలిథీన్‌ కవర్లను అధికారులు అందజేయాల్సి ఉన్నా వాటి జాడనే లేదు. రాత్రి పూట ఏ ఒక్క అధికారి ఉండడం లేదు. అంతా హమాలీలపైనే వదిలివెళ్తున్నారనే ఆరోపణలున్నాయి. వర్షం పడి జొన్నలు తడుస్తున్నా అధి కారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని అంటున్నారు. 


నాలుగు రోజుల నుంచి ఇక్కడే ఉన్నా: రామన్న, రాంనగర్‌ తాంసి

మండలం కేంద్రానికి జొన్నలు తెచ్చి నాలుగు రోజులు అయింది. తూకం అయినా రశీదు ఇవ్వలేదు. లారీ లో లోడ్‌ అయితేనే ఇస్తామంటున్నారు. ఇప్పటివరకు ఒక్కటే లారీ వచ్చింది. నా లుగు రోజుల నుంచి తిండి, నిద్ర లేదు.


జొన్నలు కొంటాం : లక్ష్మణ్‌ రాజు సీఈవో తాంసి

లారీలు రాని కారణంగా రైతులకు కొంత ఇబ్బంది కలుగుతుంది. ప్రతీ రై తు జొన్నలు కొనుగోలు చేస్తాం. రైతు లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. తూకం కాగానే రశీదులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2020-06-07T11:10:53+05:30 IST