ప్లాస్టిక్‌ ఎగ్‌తో కప్ప!

ABN , First Publish Date - 2022-01-10T05:59:10+05:30 IST

ఆకుపచ్చరంగు ప్లాస్టిక్‌ ఎగ్‌, ఆకు పచ్చ రంగు

ప్లాస్టిక్‌ ఎగ్‌తో కప్ప!


కావలసినవి

ఆకుపచ్చరంగు ప్లాస్టిక్‌ ఎగ్‌, ఆకు పచ్చ రంగు క్రాఫ్ట్‌ పేపర్‌, ఎరుపు రంగు క్రాఫ్ట్‌ పేపర్‌, గ్రీన్‌ పామ్‌ పామ్స్‌, గూగ్లీ కళ్లు, టాకిట్స్‌, మార్కర్‌, కత్తెర, జిగురు.


ఇలా చేయాలి....

 ఆకుపచ్చ రంగు క్రాఫ్ట్‌ పేపర్‌పై కప్ప కాళ్లు అవుట్‌లైన్‌ గీసి కత్తిరించాలి. అలాగే ఎరుపు రంగు క్రాఫ్ట్‌ పేపర్‌పై కప్ప నాలుక అవుట్‌లైన్‌ గీసి కత్తిరించుకోవాలి.

 కాళ్లను ప్లాస్టిక్‌ ఎగ్‌కు రెండువైపులా జిగురు సహాయంతో  అతికించాలి.

 ఎగ్‌పైన టాకిట్స్‌ అతికించి వాటిపై పామ్‌ పామ్స్‌ అంటించాలి. వాటిపై గూగ్లీ కళ్లు అతికించాలి.

 మార్కర్‌ సహాయంతో స్మైలీ గీసి నాలుకను అతికిస్తే ఫ్రాగ్‌ రెడీ.


Updated Date - 2022-01-10T05:59:10+05:30 IST