Divorce: కప్పల విడాకుల గురించి ఎపుడైనా విన్నారా?... ఎందుకు వాటిని విడదీస్తారంటే..!

ABN , First Publish Date - 2022-07-21T16:38:54+05:30 IST

ఏటా కురిసే వర్షాలపై ఆధారపడే చాలా మంది రైతులు మన దేశంలో పంటలను సాగుచేస్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే. వర్షాకాలంలో వర్షాలు కురవకపోతే.. ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో వ

Divorce: కప్పల విడాకుల గురించి ఎపుడైనా విన్నారా?... ఎందుకు వాటిని విడదీస్తారంటే..!

ఇంటర్నెట్ డెస్క్: ఏటా కురిసే వర్షాలపై ఆధారపడే చాలా మంది రైతులు మన దేశంలో పంటలను సాగుచేస్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే. వర్షాకాలంలో వర్షాలు కురవకపోతే.. ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో వర్షాలు కాస్త ఆలస్యం అయితే.. వరుణ దేవుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాలు పనులు చేస్తూ ఉంటారు. కొందరు దేవాలయాల్లో ఉన్న శివలింగాలకు జలాభిషేకం చేస్తే.. మరికొందరేమో.. యజ్ఞాలు, యాగాలు చేస్తారు. ఇంకా కొంత మంది ప్రజలు మాత్రం.. కప్పలకు పెళ్లి చేస్తారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో స్థానికులు.. కప్పలకు విడాకులు ఇచ్చి విడదీస్తారు. వినడానికి ఇది వింతగా అనిపించినా ఇదే నిజం. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ముందుగా చెప్పినట్టు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో.. ముఖ్యంగా గ్రామాల్లో నివసించే ప్రజలు.. వర్షాలు ఆలస్యం అయితే రెండు కప్పలను పట్టుకుని స్థానిక సంప్రదాయం ప్రకారం వాటికి పెళ్లి చేస్తారు. ఊరంతా వాటిని ఊరేగించిన అనంతరం.. దగ్గర్లోని చెరువుల వద్దకు వెళ్లి, వాటిని అందులో విడిచి పెడతారు. ఇలా చేయడం ద్వారా వరుణ దేవుడు కరుణించి.. వర్షాలు కురుస్తాయని ప్రజలు నమ్ముతారు. అయితే కొన్ని ప్రాంతాల్లో.. కప్పలకు విడాకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కప్పలకు విడాకులు ఇవ్వటానికి కూడా వర్షాలే కారణం. 


వర్షాలు అవసరానికి మించి దంచి కొడితే.. పంటలు పాడయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో వర్షాలు భారీ మొత్తంలో ఎడతెరిపి లేకుండా కురిసే సమయంలో దేశంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు.. రెండు కప్పలను పట్టుకుని, స్థానిక సంప్రదాయాల ప్రకారం వాటికి విడాకులు ఇస్తారు. పెళ్లి సమయంలో రెండు కప్పలను ఒకే చెరువులో వదిలేస్తే.. విడాకుల ప్రక్రియలో మాత్రం.. రెండింటినీ వేరు వేరు చెరువుల్లో వదిలేసి విడదీస్తారు. 


Updated Date - 2022-07-21T16:38:54+05:30 IST