ఆకారంతో భయపెడుతుంది!

ABN , First Publish Date - 2021-04-11T05:50:42+05:30 IST

అదొక గొంగళిపురుగు. కానీ ఏదైనా ఆపద ఎదురైనప్పుడు తన తలను భయంగొలిపేలా అస్థిపంజరంలోని పుర్రెలా మారుస్తుంది. అలా చేయడం ద్వారా తనను తాను రక్షించుకుంటుంది. ఆ విశేషాలు ఇవి

ఆకారంతో భయపెడుతుంది!

అదొక గొంగళిపురుగు. కానీ ఏదైనా ఆపద ఎదురైనప్పుడు తన తలను భయంగొలిపేలా అస్థిపంజరంలోని పుర్రెలా మారుస్తుంది. అలా చేయడం ద్వారా తనను తాను రక్షించుకుంటుంది. ఆ విశేషాలు ఇవి. 

  • ఆపద ఎదురయిన మరుక్షణం ఈ గొంగళిపురుగు తలను పెద్దదిగా చేస్తుంది. కళ్లు రెండూ పెద్దవిగా చేసి, రెండు వరుసల్లో దంతాలను బయటపెట్టి భయంకరమైన పుర్రె ఆకారాన్ని తలపించేలా మారుతుంది. అలా చేయడం ద్వారా శత్రువుల నుంచి తనను తాను కాపాడుకుంటుంది. 
  • ఈ గొంగళిపురుగు ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌, క్వీన్‌లాండ్‌, న్యూగినియా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇది పండ్లను ఆహారంగా తీసుకుంటుంది. 
  • రెక్కల భాగంలో బయటకు కనిపించని ప్రకాశవంతమైన గులాబీ గీతలు ఉంటాయి. దానివల్ల ఈ గొంగళిపురుగుకి పింక్‌ అండర్‌వింగ్‌ మాత్‌ అని పేరు వచ్చింది. ‘‘బిగ్‌ హెడ్‌ కాటెర్‌పిల్లర్‌’’ అని కూడా పిలుస్తారు.

Updated Date - 2021-04-11T05:50:42+05:30 IST