భయపెడుతున్న కరోనా మరణాలు

ABN , First Publish Date - 2021-05-07T04:08:17+05:30 IST

కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. సెకండ్‌వేవ్‌ ఉధృతితో పలువురు మృతి చెందుతున్నారు. బెల్లంపల్లి ఐసోలేషన్‌ సెంటర్‌లో బుధవారం అర్ధరాత్రి తరువాత నుంచి గురువారం వరకు ఒకరోజే 12 మంది మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది.

భయపెడుతున్న కరోనా మరణాలు
బెల్లంపల్లిలో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసిన సింగరేణి ఏరియా ఆసుపత్రి

బెల్లంపల్లి ఐసోలేషన్‌లో ఒక్కరోజే 12 మంది మృతి 

ఆందోళనలో ప్రజలు 

బెల్లంపల్లి, మే 6 : కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. సెకండ్‌వేవ్‌ ఉధృతితో పలువురు మృతి చెందుతున్నారు. బెల్లంపల్లి ఐసోలేషన్‌ సెంటర్‌లో బుధవారం అర్ధరాత్రి తరువాత నుంచి గురువారం వరకు ఒకరోజే 12 మంది మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుప త్రిని గత ఏడాది నుంచి ఐసోలేషన్‌ కేంద్రంగా నిర్వ హిస్తున్నారు. ఈ కేంద్రంలో వంద సాధారణ పడక లతోపాటు ఐసీయూలో 20 పడకల సదుపాయం ఉంది. కరోనా బాధితులతో  ఐసోలేషన్‌ కేంద్రంలోని పడకలు నిండి ఉంటున్నాయి.  

కరోనాతో ఒక్కరోజు 12 మంది మృతిచెందడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.  జిల్లాలోని వివిధ మండలాల నుంచే కాకుండా కుమరంభీం ఆసిఫాబా ద్‌ జిల్లా నుంచి సైతం కరోనా బారిన పడిన రోగులు బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రంలో చికిత్స కోసం వస్తు న్నారు. బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రంలోని వైద్యులు సరైన వైద్య చికిత్స అందించడం లేదని, రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యులు మాత్రం ప్రైవేటు ఆసుప త్రుల్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించిన తర్వాత బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రానికి తీసుకు వస్తున్నారని పేర్కొంటున్నారు.  

కరోనాతో మృతిచెందిన వారిలో బెల్లంపల్లి పట్ట ణంలోని బాబుక్యాంపు బస్తీ యువతి (35) పట్టణానికి చెందిన చెందిన మహిళ (43)  ఈ నెల 5న ఐసోలేషన్‌లో చేర్పించగా గురువారం మృతిచెందింది. ఏసీసీకి చెందిన వ్యక్తి(42) ఈ నెల 3న, చెన్నూరు పట్టణానికి చెందిన వృద్ధులు (75), (64) ఈనెల 1న ఐసోలేషన్‌ కేంద్రంలో  చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. చెన్నూర్‌కు చెందిన వ్యక్తి (45), మంచిర్యాల రాంన గర్‌కు చెందిన వృద్ధురా లు(64) ఈ నెల 3న ఐసో లేషన్‌లో చేరారు. కాసిపేట మండలం దేవాపూర్‌కు చెం దిన వ్యక్తి(59) ఈ నెల 5న, కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కెరమెరికి చెందిన మహిళ (60), ఈజ్‌గాం గ్రామానికి చెందిన వృద్ధుడు (70) ఈనెల 5న ఐసోలేష న్‌లో చేరారు. వాంకిడికి చెం దిన వృద్ధురాలు(75)కు ఈ నెల 2న, నిర్మల్‌ జిల్లాలో ని కడెంకు చెందిన వృద్ధుడు(60)కి కరోనా రావడం తో ఐసోలేషన్‌లో గురువారం చేర్పించగా అదే రోజు మృతిచెందాడు. 

కరోనాతో ముగ్గురు మృతి 

కాసిపేట:దేవాపూర్‌లో ఒక్కరోజు కరోనాతో ముగ్గురు మృతిచెందారు. ఓరియంట్‌ సిమెంట్‌ కం పెనీలో సివిల్‌ ఆఫీసులో పనిచేస్తే వ్యక్తి(49) కరీంనగర్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. సిమెంట్‌ కం పెనీ రిటైర్డు లోడింగ్‌ కార్మికుడు(55) కరోనాతో మృతిచెందాడు. అలాగే పాత అంగడి బజార్‌ ఏరి యాకు చెందిన మహిళ(50) కరోనాతో మృతిచెందిం ది. ఒక్కరోజే ముగ్గురు మృతిచెందడం పట్ల  ప్రజలు భయపడుతున్నారు. 

 వారం రోజుల వ్యవధిలో దంపతుల మృతి

తాండూర్‌: కరోనా మహమ్మారి కుటుంబాలను చిదిమేస్తోంది. తాం డూరు మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి (43) కరోనాతో చికిత్స పొందుతూ గురువారం హైదరాబాద్‌లో మృతి చెందాడు. గత నెల 29న ఆయ న భార్య మాజీ సర్పంచి (34) కరోనా బారిన పడి మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. వారం రోజుల వ్యవధిలో దంపతులను మహ మ్మారి బలి తీసుకుంది. వారికి ఒక కుమారుడున్నాడు. గత నెల 25న దంపతు లు జ్వరం, శ్వాస ఇబ్బందులు తలెత్తడంతో మంచిర్యాలలో ప్రైవేటు ఆసుప త్రిలో చేరారు. భార్య ఇక్కడే మృతి చెందగా భర్త హైదరాబాద్‌లో ఎనిమిది రోజులుగా చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు. 

Updated Date - 2021-05-07T04:08:17+05:30 IST