Abn logo
Mar 8 2021 @ 14:57PM

'ఫ్రెండ్‌ షిప్‌' టీజర్‌ విడుదల

క్రికెటర్‌ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ కలయికలో రు.25 కోట్ల భారీ బడ్జెట్ తో  రూపొందుతున్న చిత్రం ఫ్రెండ్ షిప్. జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న 'ఫ్రెండ్ షిప్' సినిమాను శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్. బాలాజీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ కోయంబత్తూర్, ఊటీలలో జరుగుతోంది. మాజీ మిస్ శ్రీలంక, తమిళ బిగ్ బాస్ విన్నర్ లోస్లియా' హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో  ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎ స్ కె) విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది. నిర్మాత ఎ.ఎన్.బాలాజీ మాట్లాడుతూ "ఇప్పటివరకు నేను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 50కి పైగా సినిమాలు నిర్మించాను. నా కెరీర్‌లో తొలిసారి ఫ్రెండ్ షిప్ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాను. ఈ చిత్రం టీజర్ విడుదల చేశాం. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.

Advertisement
Advertisement
Advertisement