జలపాతంలో కొట్టుకుపోతున్న వ్యక్తులు.. సమయానికి తలపాగ లేకుండా ఉండుంటే..!

ABN , First Publish Date - 2021-10-21T03:28:07+05:30 IST

కెనడాలో ఓ ఘటన జరిగింది. జలపాతంలో కొట్టుకుపోతున్న స్నేహితులు.. జీవితంపై ఆశలు వదులుకున్నారు. అయితే చివరకు తలపాగ కారణంగా తమ ప్రాణాలను దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళితే..

జలపాతంలో కొట్టుకుపోతున్న వ్యక్తులు.. సమయానికి తలపాగ లేకుండా ఉండుంటే..!

ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకోంవడం చూస్తుంటాం. బతుకుతామన్న ఆశలు వదులుకున్న సమయాల్లోనూ ఒక్కోసారి బతికి బయట పడ్డ సందర్భాలు ఉంటాయి. అలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది... భూమ్మీద మనకు ఇంకా నూకలు మిగులున్నాయని. కెనడాలో ఓ ఘటన జరిగింది. జలపాతంలో కొట్టుకుపోతున్న స్నేహితులు.. జీవితంపై ఆశలు వదులుకున్నారు. అయితే చివరకు తలపాగ కారణంగా తమ ప్రాణాలను దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళితే..


కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని గోల్డెన్ ఇయర్స్ ప్రావిన్షియల్ పార్క్‌లో కుల్జీందర్ కిండా అనే వ్యక్తి.. తన స్నేహితుడితో కలిసి వాకింగ్‌ చేస్తున్నాడు. ఆ సమయంలో అనుకోకుండా జారుడు బండ మీద నుంచి సమీపంలోని జలపాతంలోకి పడిపోయారు. గమనించిన స్థానికులు కేకలు వేశారు. అప్పుడే అటుగా వచ్చిన సిక్కులు వారిని గమనించారు. ఎలా కాపాడాలా అని మొదట ఆటోచించారు. అయితే చివరికి గుర్తుకు తెచ్చుకుని.. వారి తలపాగానే తాడుగా చేసి విసిరారు. స్థానికుల సాయంతో ఎట్టకేలకు వారిని బయటికి లాగారు. ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఆ స్నేహితుల పాలిట సిక్కులు దేవుళ్లలా వచ్చారంటూ.. నెటిజన్లు కీర్తిస్తున్నారు.



Updated Date - 2021-10-21T03:28:07+05:30 IST