సియోల్ మేయర్ పార్థీవదేహానికి స్నేహితులు, మద్దతుదారులు నివాళి

ABN , First Publish Date - 2020-07-13T22:23:50+05:30 IST

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు మేయర్‌‌గా వ్యవహరిస్తూ వచ్చిన పార్క్

సియోల్ మేయర్ పార్థీవదేహానికి స్నేహితులు, మద్దతుదారులు నివాళి

సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు మేయర్‌‌గా వ్యవహరిస్తూ వచ్చిన పార్క్ వాన్‌సూన్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా.. ఆయన పార్థీవదేహానికి సోమవారం స్నేహితులు, మద్దతుదారులు నివాళులర్పించారు. తన తండ్రికి నివాళులర్పించడానికి హాజరైన ప్రతి ఒక్కరికి పార్క్ వాన్‌సూన్ కూతురు డాఇన్ ధన్యవాదాలు తెలిపింది. పార్క్ వాన్‌సూన్ అంత్యక్రియలు దక్షిణ సియోల్‌లోని సియోల్ మెమోరియల్ పార్క్‌లో జరగనున్నాయి. కాగా.. పార్క్‌ వాన్‌సూన్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఓ మహిళ గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఆయనపై పోలీసులు కేసును నమోదు చేశారు. లైంగిక వేధింపుల కేసు కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఓ పర్వత ప్రాంతంలో పార్క్ వాన్‌సూన్ మృతదేహం లభ్యం కాగా.. ఆయన ఇంట్లో సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. ఆ సూసైడ్ నోట్‌లో ఇంతకాలం తనకు మద్దతుగా నిలిచిన వారందరికి కృతజ్ఞతలు చెబుతూ.. తన కుటుంబసభ్యులకు బాధ కలిగించినందుకు క్షమాపణలు తెలిపారు.  అయితే తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై మాత్రం ఆయన సూసైడ్ నోట్‌లో ప్రస్తావించకపోవడం విశేషం.  ఇదిలా ఉంటే.. పార్క్ వాన్‌సూన్ శిక్ష నుంచి తప్పించుకోవడానికే ఆత్మహత్య చేసుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క ఆయన చాలా మంచి వాడని.. ప్రజలకు ఎంతో సేవ చేశారని ఆయన మద్దతుదారులు, అభిమానులు చెబుతున్నారు.కాగా.. పార్క్ వాన్‌సూన్ సియోల్ మేయర్‌గా మూడుసార్లు గెలుపొందారు. 2022లో జరగనున్న ఎన్నికల్లో దక్షిణ కొరియా అధ్యక్షుడి రేసులో కూడా ఆయన ఉన్నారు.  

Updated Date - 2020-07-13T22:23:50+05:30 IST