Viral Video: స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్‌లను చూసి పడిపడి నవ్వుకున్న వధూవురులు

ABN , First Publish Date - 2022-05-08T23:35:14+05:30 IST

పెళ్లంటేనే హడావిడి. ముఖ్యంగా స్నేహితులు చేసే అల్లరి మామూలుగా ఉండదు. పెళ్లి సమయంలో వధువు, వరుడుని తమ తమ స్నేహితులు ఆట పట్టిస్తూ ఉంటారు. అలాగే ఫ్రెండ్ పెళ్లికి వెళ్లిన కొందరు స్నేహితులు వ

Viral Video: స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్‌లను చూసి పడిపడి నవ్వుకున్న వధూవురులు

ఇంటర్నటె డెస్క్: పెళ్లంటేనే హడావిడి. ముఖ్యంగా స్నేహితులు చేసే అల్లరి మామూలుగా ఉండదు. పెళ్లి సమయంలో వధువు, వరుడుని తమ తమ స్నేహితులు ఆట పట్టిస్తూ ఉంటారు. అలాగే ఫ్రెండ్ పెళ్లికి వెళ్లిన కొందరు స్నేహితులు వధూవరులకు వెరైటీ గిఫ్ట్‌లు ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఫ్రెండ్స్‌ ఇచ్చిన గిఫ్ట్స్‌ను చూసి వధువు, వరుడే కాదు.. అక్కడున్న కుటుంబసభ్యులు, బంధువులు కూడా పడి పడి నవ్వుకున్నారు. 





వివాహానంతరం వధూవరులను ఆశీర్వదించి తమ స్థాయికి తగిన బహుమతులను బంధువులు, స్నేహితులు ఇస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కొందరు స్నేహితులు తమ ఫ్రెండ్‌ వివాహానికి వెళ్లారు. వివాహానంతరం స్టేజీపై ఉన్న వధూవరులకు వెరైటీ బహుమతులు ఇచ్చారు. ఒక్కొక్కరుగా స్టేజిపైకి వచ్చి టాయిలెట్ క్లీనింగ్ బ్రష్, బకెట్, మగ్గు, చాట వంటి రకరకాల గిఫ్ట్‌లను నూతన దంపతుల చేతుల్లో పెట్టారు. వధూవరులకు తమ స్నేహితులు బహుమతులు ఇస్తున్న సమయంలో పెళ్లి కొడుకు మాత్రమే కాదు.. అక్కడున్న వారికి కూడా నవ్వు ఆగలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పడిపడి నవ్వుతున్నారు. ఇలాంటివి కూడా గిఫ్ట్‌లుగా ఇవ్వొచ్చా అంటూ కామంట్ చేస్తున్నారు.


Read more