Abn logo
Jan 21 2021 @ 10:14AM

తల్లి గురించి అసభ్యంగా మాట్లాడాడని కనుగుడ్లు పీకేశాడు!

చెన్నై : తన తల్లి గురించి అసభ్యంగా మాట్లాడాడన్న కోపంతో మద్యం మత్తులో స్నేహితుడి కనుగుడ్లు పీకేశాడో యువకుడు. ఆ తరువాత తాపీగా పోలీసులకు ఫోన్‌ చేసి అసలు విషయం చెప్పాడు. మంగళవారం రాత్రి మెరీనాతీరంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తెన్‌కాశి జిల్లా నీలిదనల్లూరుకు చెందిన అశోక్‌ చక్రవర్తి, పెరియపాండ్యన్‌ స్నేహితులు. వీరిద్దరూ చెన్నైలోని టీ దుకాణాల్లో పని చేస్తున్నారు. మంగళవారం రాత్రి మెరీనా తీరానికి వెళ్లి పూటుగా మద్యం సేవించారు.


ఈ సందర్భంగా అశోక్‌ చక్రవర్తి.. మద్యం మత్తులో పెరియపాండ్యన్‌ తల్లి గురించి అసభ్యంగా మాట్లాడాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పెరియపాండ్యన్‌.. తన చేతిలోని మద్యం బాటిల్‌తో అశోక్‌ తలపై మోదాడు. అతను అపస్మారకస్థితిలోకి వెళ్లినా, కోపం చల్లారకపోవడంతో పదునైన వస్తువుతో కనుగుడ్లు పెరికివేశాడు. అనంతరం పోలీస్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్‌చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని అతన్ని అరెస్టు చేశారు. అశోక్‌ను ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement
Advertisement