రూ.14 వేల కోసం పదేళ్ల స్నేహానికి పాతర.. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని ఎంత ఘోరానికి పాల్పడ్డారంటే..

ABN , First Publish Date - 2022-04-15T08:35:28+05:30 IST

వారు ముగ్గురూ స్నేహితులు.. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగారు.. పదేళ్లుగా ప్రాణ స్నేహితులుగా మెలుగుతున్నారు.. వారి మధ్య డబ్బు చిచ్చు పెట్టింది.. అప్పు తీసుకున్న స్నేహితుడు వాటిని తిరిగి ఇవ్వలేదని ఇద్దరు యువకులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.. స్నేహితుడిని ఊరికి దూరంగా తీసుకెళ్లి గొంతు కోసి...

రూ.14 వేల కోసం పదేళ్ల స్నేహానికి పాతర.. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని ఎంత ఘోరానికి పాల్పడ్డారంటే..

వారు ముగ్గురూ స్నేహితులు.. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగారు.. పదేళ్లుగా ప్రాణ స్నేహితులుగా మెలుగుతున్నారు.. వారి మధ్య డబ్బు చిచ్చు పెట్టింది.. అప్పు తీసుకున్న స్నేహితుడు వాటిని తిరిగి ఇవ్వలేదని ఇద్దరు యువకులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.. స్నేహితుడిని ఊరికి దూరంగా తీసుకెళ్లి గొంతు కోసి చంపేశారు.. అతడి జేబులో డబ్బులు తీసుకుని పరారయ్యారు.. చివరకు పోలీసులకు దొరికిపోయారు. 


వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌‌లోని తిరుమల టౌన్‌షిప్ సమీపంలోని ఖాళీ మైదానంలో మంగళవారం ఉదయం ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. విచారణలో మృతుడి పేరు అజయ్ శర్మ అని తేలింది. అతని తండ్రి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన అజయ్ తిరిగి రాలేదు. మరుసటి రోజు అతని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఘటన సమయంలో మృతుడు తన ఇద్దరు స్నేహితులు సిద్ధార్థ్‌, రాజేష్‌తో కలిసి కనిపించినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇద్దరి గురించి అన్వేషించగా వారు పరారీలో ఉన్నట్టు తేలింది. 


పోలీసులు వారి సెల్‌ఫోన్లను ట్రేస్ చేసి వారు మహారాష్ట్రలో ఉన్నట్టు తెలుసుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారు పోలీసుల ఎదుట తమ నేరాన్ని అంగీకరించారు. మృతుడు, నిందితులు పదేళ్లుగా స్నేహితులు. అజయ్ తమ వద్ద నుంచి రూ.14వేలు అప్పుగా తీసుకున్నాడని, డబ్బులు ఉన్నా సరే అప్పు తీర్చేందుకు నిరాకరించాడని, అందుకే అజయ్‌ను చంపామని వారు పోలీసులకు చెప్పారు. రాజేష్ జేబులోంచి డబ్బులు, మెడలోని బంగారు గొలుసు తీసుకుని పారిపోయామని అంగీకరించారు. 


Updated Date - 2022-04-15T08:35:28+05:30 IST