Advertisement
Advertisement
Abn logo
Advertisement

దంపతులను ఇంటికి పిలిచి విందు ఇచ్చారు.. మద్యం తాగించారు.. ఉదయం లేచి చూసే సరికి షాక్.. బట్టలు కూడా లేకుండా నగ్నంగా..

ఆ భార్యాభర్తలు తమ స్నేహితుడి ఇంటికి వెళ్లారు.. అక్కడ విందు ఆరగించారు.. వారి బలవంతం మీద మద్యం కూడా సేవించారు.. ఆ రాత్రి వారి ఇంట్లోనే నిద్రపోయారు.. తర్వాతి రోజు ఉదయం లేచి తమ పరిస్థితి చూసుకుని షాకయ్యారు.. తమ ఒంటి మీద బట్టలు లేకపోవడం చూసి నివ్వెరపోయారు.. ఇదంతా తమ స్నేహితుల కుట్ర అని తెలుసుకున్నారు.. వారి బెదిరింపులకు లొంగి రూ.17 లక్షలు సమర్పించుకున్నారు.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


అజ్మీర్‌కు చెందిన దేశ్‌రాజ్ సింగ్ రాజ్‌పుత్, ఇంద్రా దేవి దంపతులు ఈ ఏడాది జులై 5వ తేదీన తమ స్నేహితుడు రాహుల్ ఇంటికి వెళ్లారు. రాహుల్, అతడి భార్య జీవన్, మరో మహిళ మనీషా ఆ ఇంట్లో ఉన్నారు. దేశ్‌రాజ్, ఇంద్రా దేవి అక్కడకు వెళ్లి విందు భోజనం ఆరగించారు. అనంతరం సరదాగా అందరూ కలిసి మద్యం సేవించారు. స్నేహితుల బలవంతం వల్ల దేశ్‌రాజ్, ఇంద్రా దేవి అధిక మొత్తంలో మద్యం తీసుకున్నారు. అనంతరం అక్కడే నిద్రపోయారు. 


తర్వాతి రోజు ఉదయం నిద్రలేచే సరికి ఇద్దరూ నగ్నంగా ఉన్నారు. ఇద్దరూ నగ్నంగా ఉండగా తీసిన వీడియోను రాహుల్ వారికి చూపించాడు. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే దానిని ఆన్‌లైన్లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దాంతో భయపడిన దంపతులు ఇప్పటికి రెండు దఫాలుగా రూ.17 లక్షలు ఇచ్చారు. అయినా నిందితులు వారిని డబ్బులు అడుగుతుండడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపు లోకి తీసుకున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement