Abn logo
Apr 15 2021 @ 18:21PM

వైరల్ వీడియో.. ప్రేమను కౌగిలింతలో ప్యాక్ చేసి ఇస్తే..

ఇంటర్నెట్ డెస్క్: కౌగిలింత..ప్రేమను వ్యక్తం చేసే ఓ చర్య! నేనున్నాను..నీకేం కాదు అనే భరోసా! మరి కౌగిలింతలు మనుషులకే పరిమితమా అంటే కానే కాదు. జంతువులు కూడా అప్పుడప్పుడూ మన భాషలోనే మనపై ప్రేమను వ్యక్తం చేస్తుంటాయి. పెంపుడు జంతువులు ఉన్న వారికి ఈ విషయం సుపరిచితమే. ప్రస్తుతం ఇటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అటవీ శాఖ అధికారి సుశాంత నంద దీన్ని ట్విటర్‌లో షేర్ చేశారు. సముద్రంలో స్కూబా డైవింగ్‌కు దిగిన ఓ వ్యక్తి వద్దకు సీల్ వచ్చి అచ్చు మనిషిలాగే అతడిని కౌగిలించుకుంటుంది. స్కూబా డైవర్ కూడా అందుకు తగ్గట్టుగానే సీల్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వీపుపై తడతాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అందరూ తెగ మురిసిపోతున్నారు. ఆ స్కూబా డైవర్ చాలా అదృష్టవంతుడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అతడి అదృష్టానికి మాకు అసూయ కలుగుతోందని కూడా కొందరు కామెంట్ చేశారు. ఇక సుశాంత నందా కూడా ఈ వీడియోపై తన దైన శైలిలో కామెంట్ చేశారు. ప్రేమను కౌగిలింతలో చుట్టి ఇస్తే.. అంటూ క్యాప్షన్ జత చేశారు. 1.2 వేల లైకులతో తెగ వైరల్ అవుతున్న ఈ క్యూట్ వీడియోను వీరూ ఓ లుక్కేయండి..!


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement