స్నేహం అనేది బలం- కష్టకాలంలో ఆదుకునే దైవం

ABN , First Publish Date - 2020-08-02T21:40:00+05:30 IST

స్నేహం ఎంతో బలం అని స్నేహమనే మాటలోనే ఎంతో మాధుర్యం ఉందని,స్వచ్చమైన స్నేహానికి అడ్డుగోడలు ఉండవని తెలంగాణ పద్మశాలి అఫీషియల్స్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్‌ అన్నారు.

స్నేహం అనేది బలం- కష్టకాలంలో ఆదుకునే దైవం

హైదరాబాద్‌: స్నేహం ఎంతో బలం అని స్నేహమనే మాటలోనే ఎంతో మాధుర్యం ఉందని,స్వచ్చమైన స్నేహానికి అడ్డుగోడలు ఉండవని తెలంగాణ పద్మశాలి అఫీషియల్స్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్‌ అన్నారు. పౌరసరఫరాలశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో డిప్యూటీ తాహసిల్దార్‌గా పనిచేస్తున్న రఘునందన్‌ ఆదివారంస్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాంత్రిక జీవనంలో స్నేహం మాత్రమే మనిషికి అమృతంలాగా పనిచేస్తుందన్నారు. ఓ వ్యక్తిని మహత్తర శక్తిగా మలచగలిగేది స్నేహమేనని అన్నారు. ఉత్తమ సాంగత్యంతో ఒనగూరే స్నేహమే వ్యక్తిత్వ వికాసానికి సోపానంగా భాసిల్లుతుందన్నారు. మాయమైపోతున్న మానవీయ విలువల నేపధ్యంలో మానవత్వం మాధుర్యం చాటేవారే నిజమైన స్నేహితులని ఆయన స్పష్టం చేశారు. 


2018 అక్టోబరు 4న తాము తంగెళ్ల విజయ్‌బాబు, కాలేరు శంకర్‌, సురేంద్ర కుమార్‌, సర్వసురేష్‌ తదితర సిటీకాలేజీ మిత్రుల తక్షణస్పందన వల్లే సకాలంలో మా మిత్రుణ్ణి అనారోగ్యం నుంచి కాపాడుకోగలిగామని వివరించారు.తన బాల్య దశ నుంచి ఇప్పటి వరకూ కేవలం వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలో ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టే స్నేహితులని చూశానన్నారు. ఈ కరోనా కష్టకాలంలో ఎవరు ఎంత నిజమైన స్నేహితులో తేటతెల్లం చేసిందన్నారు. స్వచ్చమైన స్నేహానికి ముసుగులు మాస్కులు ఉండవనే ఉండవని రఘనందన్‌ అన్నారు. ఘోరమైన కష్టకాలంలో ఆదుకోగల దేవుడే నిజమైన స్నేహితుడని అన్నారు. 

Updated Date - 2020-08-02T21:40:00+05:30 IST