Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 22 Oct 2021 11:00:12 IST

Aryan Khan కు, Ananya Panday కు అసలు సంబంధం ఏంటి..? వాళ్లిద్దరికీ అసలు ఎలా పరిచయం ఏర్పడిందంటే..

twitter-iconwatsapp-iconfb-icon
Aryan Khan కు, Ananya Panday కు అసలు సంబంధం ఏంటి..? వాళ్లిద్దరికీ అసలు ఎలా పరిచయం ఏర్పడిందంటే..

ఆర్యన్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు బాలీవుడ్ కథానాయిక అనన్యా పాండే ఇంటిపై దాడులు చేయడంతో ఒక్కసారిగా ఆమె పేరు మార్మోగిపోతోంది. బాలీవుడ్‌కు చెందిన ఓ కథానాయికతో ఆర్యన్ డ్రగ్స్ గురించి వాట్సాప్ ఛాట్ చేసినట్టు ఎన్‌సీబీ అధికారులు గత బుధవారం కోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ కథానాయిక అనన్యా పాండేనే అని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె గురించి ఇంటర్నెట్‌లో అందరూ అన్వేషణ సాగిస్తున్నారు. 


బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చుంకీ పాండే తనయ అనన్య పాండే. 2019లో `స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌ 2` చిత్రంతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న `లైగర్` సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, అమితాబ్‌ మనవరాలు నవ్య నవేలి నందా, హీరోయిన్లు సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్‌.. అనన్యకు మంచి స్నేహితులు. ముఖ్యంగా సుహానా, ఆర్యన్ ఈమెకు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. వీళ్లంతా కలిసి తరచుగా పార్టీలకు, పబ్‌లకి వెళ్తుంటారు. 


అనన్య, సుహానా మాత్రమే కాదు.. సుహానా తల్లి గౌరి, అనన్య తల్లి భావనా పాండే కూడా మంచి స్నేహితురాళ్లు. తరచుగా కలుస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆర్యన్, అనన్య కుటుంబాల మధ్య కూడా స్నేహం ఉంది. దీంతో చిన్నప్పటి నుంచి ఆర్యన్, సుహానా, అనన్య కలిసే పెరిగారు. తమ ఇతర స్నేహితులతో కలిసి తరచుగా పార్టీలు చేసుకుంటుంటారు. కాగా, ఈ నెల రెండో తేదీన రేవ్ పార్టీ జరుగుతన్న సమయంలో ఆర్యన్ ఖాన్.. డ్రగ్స్ కోసం అనన్యకు వాట్సప్ మెసేజ్ పంపిన సమాచారం. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement