భర్త ఎదురుగానే భార్యపై అత్యాచారం.. విషయం ఏంటో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-04-23T22:18:50+05:30 IST

ఆ మహిళను భర్త గత నెలలో ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు.. ఆమె సంతోషంగా భర్తతో కలిసి హోటల్ గదికి వెళ్లింది..

భర్త ఎదురుగానే భార్యపై అత్యాచారం.. విషయం ఏంటో తెలిస్తే షాక్!

ఆ మహిళను భర్త గత నెలలో ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు.. ఆమె సంతోషంగా భర్తతో కలిసి హోటల్ గదికి వెళ్లింది.. ఆ గదిలో అప్పటికే భర్త స్నేహితుడు ఉన్నాడు.. అతడు భర్త ఎదురుగానే ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. కాపాడాల్సిన భర్త నోరు మూసుకుని ఉండాలని హెచ్చరించాడు.. అనంతరం ఈ నెలలో ఇంట్లో ఎవరూ లేనపుడు భర్త మరో స్నేహితుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారం చేశాడు.. ఈ సారి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళ భర్తను, స్నేహితుడిని అరెస్ట్ చేశారు. మరో స్నేహితుడి కోసం గాలిస్తున్నారు. 


హర్యానాలోని రేవారి జిల్లాలోని ఓ కాలనీకి చెందిన మహిళ గత నెల 5వ తేదీన ఢిల్లీ రోడ్డులోని ఓ హోటల్‌కు తన భర్తతో కలిసి వెళ్లింది. అక్కడ అప్పటికే భర్త స్నేహితుడు ఉన్నాడు. హోటల్ గదిలో బాధిత మహిళను భర్త ఎదురుగానే అత్యాచారం చేశాడు. నోరు మూసుకుని ఉండాలని భర్త హెచ్చరించడంతో ఆమె సైలెంట్‌గా ఉండిపోయింది. ఈ నెల 13వ తేదీన బాధిత మహిళ భర్త, అత్త ఊరు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై భర్త మరో స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 


ఈ సారి బాధిత మహిళ తన తల్లికి విషయం చెప్పింది. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదే రోజు బాధిత మహిళ భర్తను, అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. హోటల్‌లో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి గురించి అన్వేషణ సాగిస్తున్నారు. 

Updated Date - 2022-04-23T22:18:50+05:30 IST