ఫ్రైడ్‌ ఆనియన్‌ రింగ్స్‌

ABN , First Publish Date - 2020-12-26T20:40:10+05:30 IST

మైదా - ఒక కప్పు, ఉప్పు - తగినంత, బేకింగ్‌ పౌడర్‌ - అర టీస్పూన్‌, వెల్లుల్లి పొడి - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, ఆలివ్‌ ఆయిల్‌ - ఒక టీస్పూన్‌, పాలు - ఒక టేబుల్‌స్పూన్‌, వాము ఆకు పొడి (ఒరెగానో) - ఒక టీస్పూన్‌.

ఫ్రైడ్‌ ఆనియన్‌ రింగ్స్‌

కావలసినవి: ఉల్లిపాయలు - నాలుగైదు, బ్రెడ్‌ ముక్కలు - అరకప్పు. 


మైదా మిశ్రమం: మైదా - ఒక కప్పు, ఉప్పు - తగినంత, బేకింగ్‌ పౌడర్‌ - అర టీస్పూన్‌, వెల్లుల్లి పొడి - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, ఆలివ్‌ ఆయిల్‌ - ఒక టీస్పూన్‌, పాలు - ఒక టేబుల్‌స్పూన్‌, వాము ఆకు పొడి (ఒరెగానో) - ఒక టీస్పూన్‌.


ఎగ్‌ మిక్స్‌: ఎగ్‌వైట్‌ - ఒకటి, ఉప్పు - కొద్దిగా, మిరియాల పొడి - అర టీస్పూన్‌.


తయారీ విధానం: ఒక పాత్రలో మైదా తీసుకుని అందులో ఉప్పు, బేకింగ్‌ పౌడర్‌, వెల్లుల్లి పొడి, మిరియాల పొడి, ఒరెగానో వేసి కలపాలి. ఆలివ్‌ ఆయిల్‌, పాలు పోయాలి. అరకప్పు నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా కలపాలి. మరొక పాత్రలో ఎగ్‌వైట్‌ తీసుకుని అందులో మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాలి. ఒక ప్లేట్‌లో బ్రెడ్‌ ముక్కలు తీసుకోవాలి. ఉల్లిపాయలు గుండ్రంగా తరిగి, మైదా మిశ్రమంలో డిప్‌ చేయాలి.తరువాత ఎగ్‌వైట్‌లో డిప్‌ చేయాలి. ఇప్పుడు బ్రెడ్‌ ముక్కలు అద్ది పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక బ్రెడ్‌ ముక్కలు అద్ది పెట్టుకున్న రింగ్స్‌ వేసి వేగించాలి. చట్నీతో తింటే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి.



Updated Date - 2020-12-26T20:40:10+05:30 IST