Abn logo

ఫ్రైడ్‌ చికెన్‌

కావలసినవి: చికెన్‌ బ్రెస్ట్‌లు - ఆరు, ఎగ్‌వైట్‌ - రెండు, ఉప్పు - కొద్దిగా, నువ్వులు - అర కప్పు, నూనె - సరిపడా.


తయారీ విధానం: ముందుగా చికెన్‌ బ్రెస్ట్‌లను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో ఎగ్‌వైట్‌లు తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. మరొక ప్లేట్‌లో నువ్వులు తీసుకోవాలి. ఇప్పుడు చికెన్‌ ముక్కలను ఎగ్‌వైట్‌లో డిప్‌ చేసి, నువ్వులు సమంగా అంటేలా అద్దాలి. తరువాత ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. స్టవ్‌పై డీప్‌ ఫ్రై పాన్‌ పెట్టి నూనె పోయాలి. నూనె వేడి అయ్యాక చికెన్‌ ముక్కలు వేసి వేగించాలి. ఐదు నిమిషాల పాటు వేగిన తరువాత ముక్కలు మరోవైపు తిప్పి మరికాసేపు వేగించి తీసుకోవాలి. నువ్వుల చికెన్‌ బ్రెస్ట్‌లను చిల్లీ సాస్‌తో కలిపి సర్వ్‌ చేయాలి.

ముర్గ్‌ మలాయి కబాబ్‌రొయ్యలు క్రిస్పీగా..స్వీడిష్‌ మీట్‌ బాల్స్‌మటన్‌ లుక్మీమటన్‌ కీమా బాల్స్ఎగ్ వడఎగ్‌రోల్‌ఎగ్‌ ఫింగర్స్‌కబాబ్స్‌ఎగ్‌ 65
Advertisement
Advertisement