ఫ్రైడే ఎట్‌ 168

ABN , First Publish Date - 2020-08-08T09:52:33+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి మరింత పెరుగుతోంది. ఇరు జిల్లాల్లో కలిపి శుక్రవారం 168మందికి పాజిటివ్‌ రాగా ఇద్దరు మృతిచెందారు.

ఫ్రైడే ఎట్‌ 168

ఉమ్మడి ఖమ్మంలో విజృంభిస్తున్న కరోనా 

ఖమ్మం జిల్లాలో 122, భద్రాద్రిలో 46మందికి లక్షణాలు

ఇద్దరి మృతి


(ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం నెట్‌వర్క్‌)

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి మరింత పెరుగుతోంది. ఇరు జిల్లాల్లో కలిపి శుక్రవారం 168మందికి పాజిటివ్‌ రాగా ఇద్దరు మృతిచెందారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలో 336మందికి ర్యాపిడ్‌ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా 122మందికి పాజిటివ్‌ వచ్చినట్టు జిల్లా వైద్యఅధికారులు హెల్త్‌బులిటెన్‌లో పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 46మందికి పాజిటివ్‌ వచ్చింది. ఖమ్మం జిల్లా మధిరలో పది మందికి, సత్తుపల్లిలో పదిమందికి, నేలకొండపల్లిలో ఆరుగురికి, వైరాలో ఏడుగురికి, ఎర్రుపాలెం మండలంలో ఎనిమిది మందికి, కొణిజర్ల మండలంలో ఆరుగురికి, కల్లూరు మండలంలో ఐదుగురికి, బోనకల్‌ మండలంలో నలుగురికి, ముదిగొండలో ఇద్దరికి కరోనా లక్షణాలు నిర్ధారణవగా వీరితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 64మంది కూడా కొవిడ్‌ బారినపడ్డారు.


భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 46మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణైంది. అశ్వారావుపేటలో ఓ కానిస్టేబుల్‌కు, అశ్వాపురంలో ఐదుగురికి, గుండాల మండలంలో ఇద్దరికి, ఇల్లెందులో నలుగురుకి, టేకులపల్లి మండలంలో ముగ్గురికి, లక్ష్మీదేవిపల్లిలో ఒకరికి, జూలూరుపాడులో ఇద్దరికి, భద్రాచలంలో 15మందికి, పాల్వంలో 10మందికి, చర్ల మండలలో ఇద్దరికి, దుమ్ముగూడెం మండలంలో ఒకరికి కరోనా లక్షణాలున్నట్టు నిర్ధారణైంది. ఈ క్రమంలోనే భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్‌వో నరే్‌షకుమార్‌తో పాటు ఓ మహిళ విలేకరి కూడా మృతి చెందారు.

Updated Date - 2020-08-08T09:52:33+05:30 IST