France Presidentకి ఎదురుదెబ్బ.. అధ్యక్షుడైన 2 నెలలకే..

ABN , First Publish Date - 2022-06-20T17:22:58+05:30 IST

ఏప్రిల్‌లో జ‌రిగిన ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్ గెలుపొందారు. ఏప్రిల్‌లో జరిగిన ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి మెరీన్‌ లీ పెన్‌పై మెక్రాన్‌ స్పష్టమైన విజయం సాధించారు. మాక్రాన్‌కు 58 శాతం ఓట్లు రాగా, పెన్‌కు 42 శాతం ఓట్లు పడ్డాయి..

France Presidentకి ఎదురుదెబ్బ.. అధ్యక్షుడైన 2 నెలలకే..

పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన రెండు నెలలకే ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆయన కూటమి మెజారిటీ కోల్పోయింది. దీంతో మరో ఐదేళ్ల పాటు తాను అధ్యక్షుడిగానే ఉన్నప్పటికీ జాతీయ అసెంబ్లీపై ఆయన పట్టు ప్రశ్నార్థకమైంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో అతిపెద్ద కూటమిగా ఇమ్మాన్యూయెల్ నేతృత్వంలోని ‘టుగెదర్’ కూటమి విజయం సాధించినప్పటికీ.. పార్లమెంటులో మెజారిటీకి 289 సీట్లు అవసరం కాగా టుగెదర్‌ కూటమి 245 స్థానాల వద్దే ఆగిపోయింది. తమకు పటిష్టమైన మెజారిటీ అందివ్వాలంటూ ఓటర్లకు మాక్రాన్ ఇచ్చిన పిలుపు ఫలించలేదు. కాగా ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బోర్న్ ఈ విషయమై స్పందిస్తూ మెజారిటీని నిర్మించడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.


ఏప్రిల్‌లో జ‌రిగిన ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్ గెలుపొందారు. ఏప్రిల్‌లో జరిగిన ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి మెరీన్‌ లీ పెన్‌పై మెక్రాన్‌ స్పష్టమైన విజయం సాధించారు. మాక్రాన్‌కు 58 శాతం ఓట్లు రాగా, పెన్‌కు 42 శాతం ఓట్లు పడ్డాయి. కాగా, గడిచిన 20 ఏళ్లలో వరుసగా రెండు సార్లు ఫ్రాన్స్(France) అధ్యక్షుడైన వ్యక్తిగా మాక్రాన్‌ రికార్డు సృష్టించారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రాజకీయాల్లో గ‌డిచిన ఐదేళ్ల‌లో యువనేత‌గా ఎదిగారు. యూరోపియన్ యూనియన్‌లో కీలక నిర్ణయాలు తీసుకునే ప్రధాన ప్రపంచ నాయకుడిగా తనను తాను మార్చుకున్నారు. ఉక్రెయిన్‌లో రష్యా విధించిన యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలలో దౌత్యవేత్తగా పాల్గొన్నాడు.

Updated Date - 2022-06-20T17:22:58+05:30 IST