అంకిత ముందుకు..రామ్‌కుమార్‌ ఇంటికి

ABN , First Publish Date - 2020-09-23T09:13:59+05:30 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వాలిఫయర్స్‌లో భారత యువ ఆటగాడు రామ్‌కుమార్‌ రామనాథన్‌ కథ ముగిసింది. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ...

అంకిత ముందుకు..రామ్‌కుమార్‌ ఇంటికి

ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వాలిఫయర్స్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వాలిఫయర్స్‌లో భారత యువ ఆటగాడు రామ్‌కుమార్‌ రామనాథన్‌ కథ ముగిసింది. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 198వ ర్యాంకర్‌ రామ్‌కుమార్‌ 5-7, 2-6తో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ట్రిస్టన్‌ లామసినె (ఫ్రాన్స్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇక, మహిళల సింగి ల్స్‌లో భారత అమ్మాయి అంకితా రైనా  ముందంజ వేసింది. తొలిరౌండ్‌లో అంకిత 6-4, 4-6, 6-4తో జొవానా జోవిక్‌ (సెర్బియా)పై గెలిచి రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. కాగా, మరో భారత ఆటగాడు ప్రజ్ఞేష్‌ గుణేశ్వరన్‌ రెండో రౌండ్‌లో అలెగ్జాండర్‌ యూకిక్‌ (ఆస్ట్రేలియా)తో తలపడనున్నాడు. 

Updated Date - 2020-09-23T09:13:59+05:30 IST